Homeweathertoday weather report (06-06-2023) : మరో వారం రోజులు ఎండలు దంచికొడతాయి..

today weather report (06-06-2023) : మరో వారం రోజులు ఎండలు దంచికొడతాయి..

Telugu Flash News

today weather report : ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైంది. సాధారణంగా ప్రతి సీజన్‌లో జూన్ 1 నాటికి, నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన తర్వాత నాలుగైదు రోజుల్లోనే విస్తరిస్తాయి.

అరేబియా సముద్రం ఆగ్నేయ ప్రాంతంలో 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తన ద్రోణి ఈసారి కేరళ తీరం వైపు రుతుపవనాల కదలిక నిలిచిపోవడానికి కారణం.

రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఈ నెల 8 నాటికి తుపాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం రుతుపవనాల కదలికలను ప్రభావితం చేస్తుంది.

ఈ పరిస్థితులు కేరళ తీరం వైపు నైరుతి రుతుపవనాల పురోగతిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని భావిస్తున్నారు.

ఎల్ నినో పరిస్థితులు ఉన్నప్పటికీ సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఎండీ తెలిపారు. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ఎండల తీవ్రత కొనసాగుతోంది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారం రాష్ట్రంలో మంగళవారం నుండి ఒక వారం రోజుల పాటు ఎండలు దంచికొడతాయట. జాగ్రత్తగా ఉండండి.

-Advertisement-

తెలంగాణ వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌ వరకు స్థిరంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

రానున్న ఐదు రోజుల పాటు వడగళ్ల వాన కురిసే అవకాశం ఉన్నందున పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

రానున్న మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో సర్క్యులేషన్ కొనసాగుతోందని వెల్లడించింది. ద్రోణి ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుండి విదర్భ మీదుగా తెలంగాణ వరకు విస్తరించి ఉందని పేర్కొంది.

read more news :

Horoscope (06-06-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News