Tirumala News : తిరుమల కాలిబాట దారి లో భక్తులకు కర్రలు పంపిణీ చేశారు. నడకదారిలో వెళ్ళే శ్రీవారి భక్తులకు కర్రలు పంపిణీ చేయాలని టీటీడీ ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అలిపిరి మెట్లపై భక్తులకు పదివేల కర్రలను అందుబాటులో ఉంచారు. మరో పదివేల కర్రలను కూడా సిద్ధం చేయనున్నారు. మొత్తం 20 వేల కర్రలను సిద్ధం చేస్తున్నారు. వీటికి రూ.45 వేలు మాత్రమే ఖర్చు చేసినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కర్రల పంపిణీ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.
భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ…. “చేతిలో కర్ర ఉంటే జంతువులు రావని చెప్తారు. చేతి కర్రల పంపిణీ చేసి మా పని అయిపోయిందని అనుకోవడం లేదు’’ అని ఆయన తెలిపారు. భక్తులకు చేతి కర్రలు ఇచ్చి తిరిగి నరసింహ తీర్థం వద్ద తీసుకుంటారు. చేతి కర్ర ఇవ్వడమే కాకుండా మెట్లదారిలో టీటీడీ భద్రతా సిబ్బంది కూడా ఉంటారని తెలిపారు.