Homehealthweight loss tips in telugu : బరువు తగ్గడానికి పంచౌషధాలు..

weight loss tips in telugu : బరువు తగ్గడానికి పంచౌషధాలు..

Telugu Flash News

భారతీయ వంటల్లో సుగంధ ద్రవ్యాలకు చాలా ప్రాముఖ్యం ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర స్థూలకాయం సమస్య చాలా తక్కువ. అందుకు ఈ సుగంధ ద్రవ్యాలే కారణమని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. బరువు తగ్గడానికి పంచౌషధాలు ఆహారంలో చేర్చుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు.

దాల్చిన చెక్క :

cinnamon

రోజులో ఒక్క చెంచాడు దాల్చినచెక్క పొడిని తీసుకున్నారంటే మీ అధిక బరువు క్రమంగా తగ్గిపోతుంది. ఆరోగ్యం, అందం కూడా మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు జరిపిన పలు పరిశోధనల్లో వెల్లడైంది. దీనికి రక్తంలో గ్లూకోజ్ ని తగ్గించే గుణం ఉంది. చెడు కొలెస్టరాల్ ను 27 శాతం వరకూ తగ్గించే శక్తి దీని సొంతం. టైప్ 2 మధుమేహ రోగులకు ఇది మంచి ప్రయోజనకారి. రక్తం గడ్డ కట్టకుండా నిరోధిస్తుంది. దీన్ని మోతాదుకు మించి తీసుకోకూడదు. అలా తీసుకుంటే దీనిలో ఉండే కొమారిన్ అనే రసాయనం లివర్ కి హాని చేస్తుంది.

మిరపకాయ :

ఎర్రటి పొడవైన మిరపకాయల్లో క్యాప్సాసిన్ అనే రసాయనం ఉంటుంది. దీనికున్న గుణమేమిటంటే కేంద్రనాడీ వ్యవస్థను ఉత్తేజపరచి శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఆ వేడికి శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుందని పరిశోధనల్లో స్పష్టమైంది. ఆకలి పుట్టించే గుణం కూడా దీనికుంది. ఈ రసాయనం శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకోకుండా చూడడంలో అద్భుతంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.

నల్ల మిరియాలు :

-Advertisement-

ఇప్పుడంటే వీటిని ఆహారంలో వాడకం తగ్గించాం కానీ పూర్వం మిరపకాయలకు బదులుగా మిరియాల పొడినే ఉపయోగించేవారు. నల్ల మిరియాలతో మంచి ఆరోగ్య ప్రయో జనాలున్నాయి. జీర్ణశక్తిని వృద్ధి చేయడానికి ఇవి ఎంతగానో సహకరిస్తాయి. తీసుకున్న ఆహారం ద్వారా శరీరం లోని అన్ని భాగాలకూ పోషకాలందేలా చూస్తాయి. దీనిలో ఉండే పిపరిన్ రసాయనం దేహంలోని జీవక్రియలను ఉత్తేజ పరుస్తుంది. శరీర బరువు సమతుల్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది. తాజా మిరియాల్లో ఔషధ గుణాలెక్కువగా ఉంటాయి.

ఆవాలు :

ఇక ఈ జాబితాలో తర్వాతి స్థానం ఆవాలదే. ఇవి కూడా దేహంలో జీవక్రియలను ఉత్తేజపరుస్తాయి. దాంతో అధికంగా ఉన్న కొవ్వు వేగంగా కరిగిపోయి బరువు తగ్గడం సులభమవుతుంది. రోజుకొక చెంచాడు ఆవ పిండిని తీసుకుంటే 25 శాతం మేరకు జీవక్రియలు ఉత్తేజిత మవుతాయని ఇంగ్లండ్ లోని ఆక్స్ ఫర్డ్ పాలిటెక్నిక్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తాజాగా వెల్లడైంది. అధిక రక్తపోటు తగ్గించడానికి ఆవనూనె చక్కగా పనిచేస్తుంది. వీటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఐరన్, మాంగనీస్, జింక్, ప్రొటీన్, కాల్షియం, నయసిస్ సమృద్ధిగా లభిస్తాయి.

అల్లం :

అల్లానికి ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యం ఉంది. మూత్ర విసర్జన సాఫీ గా జరిగేందుకు ఇది ఎంతగానో సహకరిస్తుంది. జీవక్రియలు సాఫీగా సాగేందుకు సైతం ఇది తోడ్పడుతుంది. అంతేకాదు తీసుకున్న ఆహారంలో చెడును వెంటనే బయటకు నెట్టేస్తుంది. దాంతో బరువు పెరగకుండా ఉండడం సాధ్యమవు తుంది. వొవేరియన్ క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేసే శక్తి అల్లానికి ఉందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. జలుబు, మైగ్రేన్, ఉదయం పూట మగతగా ఉండే ఇబ్బందులను సైతం ఇది తొలగిస్తుంది. ఈ సుగంధ ద్రవ్యాలతో ఇంకా పలు ఇతర ప్రయోజనాలు సైతం ఉన్నాయి.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News