Tuesday, May 14, 2024
Homebeautyదానిమ్మ గింజల్లాంటి దంతాలు మీ సొంతం కావాలంటే ఈ టిప్స్ పాటించండి..

దానిమ్మ గింజల్లాంటి దంతాలు మీ సొంతం కావాలంటే ఈ టిప్స్ పాటించండి..

Telugu Flash News

అందమైన చిరునవ్వు, పలువరుస పరుగులెత్తే వారిని కూడా ఆపేసే శక్తి ఉంది. మనవీ అలా ఉంటే బాగుండు అని అనిపిస్తోంది కదూ.. ఆ మరెందుకు ఆలస్యం? దానిమ్మ గింజల్లాంటి దంతాలు మీ సొంతం కావాలంటే ఈ టిప్స్ పాటించండి..

  1. బ్రష్ చేసుకోకుండా కాఫీ, టీ త్రాగేవాళ్లు కనీసం గ్లాసుడు నీళ్ళతో నోటిని శుభ్రపరుచుకోవాలి.
  2. ‘బే’ చెట్టు ఆకుల్ని ఎండబెట్టి వారానికి 2 సార్లు వాటితో పళ్ళు రుద్దితే మీ పళ్ళు నిగనిగలాడుతాయి.
  3. కాస్త ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా కలిపి పళ్ళను తోమితే తెల్లటి మెరుపు మీ సొంతం.
  4. నిమ్మతొక్కలు, వేపాకులు బాగా ఎండబెట్టి పొడిచేసిన తర్వాత తగినంత ఉప్పు కలిపి పళ్ళను తోమితే గారపట్టిన పళ్ళు కూడా ఫ్రెష్ గా కనిపిస్తాయి.
  5. నల్ల ద్రాక్షరసంతో పళ్ళను కడుక్కున్నా సరిపోతుంది.
  6. బ్రెడ్ చుట్టూ ఉన్న అంచులను ఎండబెట్టి వేడిచేసి మిరియం, ఉప్పుపొడి కలిపిన మిశ్రమంతో పళ్ళు తోము కున్నా తెల్లబడతాయి.
  7. ఉల్లిగడ్డ పేస్టులో 2 తేనెచుక్కలు, కొంచెం నిమ్మరసం కలిపి శుభ్రంగా రుద్దుకుంటే పళ్ళు తెల్లగా మెరుస్తాయి.
  8. పళ్ళమీద పచ్చటి మరకలుంటే స్ట్రాబెరీ పండును చిదిమి ఆ గుజ్జును రోజూ పళ్ళమీద రాస్తే ఆ మరకలు పోతాయి.
  9. రాత్రి నిద్రపోయే ముందు, భోజనం అయ్యాక ఆపిల్ పండు తింటే దంతవ్యాధులు పోయి గట్టి చిగుళ్లు ఏర్పడతాయి.

ఇప్పుడు నవ్వుతుంటే అందరూ మీ పళ్ళవరుసనే చూస్తారు. గమనించండి.

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News