Homebeautyఅందమైన అధరాల కోసం..గులాబీలు మీ పెదాలపై పూయాలంటే..ఇలా చేయండి !

అందమైన అధరాల కోసం..గులాబీలు మీ పెదాలపై పూయాలంటే..ఇలా చేయండి !

Telugu Flash News

అందమైన అధరాల కోసం…గులాబీలు మీ పెదాలపై పూయాలంటే …సున్నితమైన పెదాలను సున్నితం గానే చూసు కోవాలి. ఎలాగంటే …

  1. అందమైన అధరాల కోసం గులాబీ రేకులను పాలతో నూరి పేస్టులా చేసి పెదాలకు రాసి కొంతసేపు ఉంచుకొని కడిగేసుకోవాలి.
  2. ఒక చెంచా శనగపిండి, మీగడ, నిమ్మరసం కలిపి పెదవులకు పూసి అరగంట తర్వాత కడిగేసుకుంటే పెదాలు గులాబీ రేకుల్లా మెరుస్తాయి.
  3. తేనె, నిమ్మరసం, గ్లిజరిన్ కలిపి రాత్రిపూట పడుకునే ముందు రాసి మర్దన చేసుకుంటే పెదాల పైనున్న నలుపు హుష్ కాకి!
  4. పాలమీద మీగడను పెదాలపై మర్దన చేస్తే పెదాలు మృదువుగా మెరుస్తూ కనిపిస్తాయి.
  5. నిద్రపోయే ముందు పెదాలకు నెయ్యి రాస్తే పెదాలు పగలనే పగలవు.
  6. చిటికెడు తేనెలో అంతే మోతాదులో కీర రసం లేదా క్యారెట్ రసం కలిపి రాత్రి పడుకునే ముందు పెదాలకు రాస్తే ఉదయానికి సున్నితంగా పూలరెక్కల్లా ఉంటాయి.
  7. ఆపిల్ గుజ్జులో వెన్న కలిపి పెదాలకు రాస్తే పగిలిన పెదవులు త్వరగా మామూలు స్థితికి వస్తాయి.
  8. తేనెలో కొత్తిమీర రసం కలిపి పెదవులకు రాసుకుంటే చలికాలంలో ఎదురయ్యే సమస్యలు తగ్గుతాయి. నల్లగా ఉన్న పెదవులు ఎర్రబడతాయి కూడా !
  9. ప్రతిరోజూ చిటికెడు వెన్న కానీ, నెయ్యి కానీ పెదవులకు రాస్తే శీతాకాలం సమస్యలు హుష్ …కాకే !
  10. రెండు టేబుల్ స్పూన్ల తేనెలో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, అంతే మోతాదు గ్లిజరిన్ కలిపితే లిప్ బామ్ రెడీ ! ప్రతిరోజూ పెదవులకు ఒకేసారి తయారు చేసుకొని రాసు కోవచ్చు.
-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News