Monday, May 13, 2024
Homebeautytips for healthy nails : మీ గోళ్లు ఆరోగ్యంగానే ఉన్నాయా..? గోళ్ళు శుభ్రంగా లేకపోతే ప్రమాదమే!

tips for healthy nails : మీ గోళ్లు ఆరోగ్యంగానే ఉన్నాయా..? గోళ్ళు శుభ్రంగా లేకపోతే ప్రమాదమే!

Telugu Flash News

tips for healthy nails : చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళని కాదు చాలామందికి గోళ్ళు కొరుక్కోవడం అనేది ఒక అలవాటు. చెడ్డ అలవాటు. దాని వల్ల ఎంత నష్టం ఉందో తెలిసినా మానరు. మంచిని గ్రహించ టానికి ప్రయత్నం చేసినట్లే చెడును వదిలెయ్యాలని గట్టి నిర్ణయం తీసుకోవాలి. ప్రయత్నం చేస్తే తప్పక సాధిస్తాం!

  1. గోళ్ళరంగు లేత గులాబీ రంగులో ఉండాలి. నలుపురంగు కి మారిందా మీలో అనారోగ్యం చేరినట్లే !
  2. గోళ్ళు నలుపు – తెలుపు రంగులకు మారుతుంటే రక్తహీనతకు, చెడు రక్తానికి చిహ్నం అని మరువకండి.
  3. గోళ్ళ అడుగు భాగంలో పగుళ్ళు వస్తే గుండె బలహీన మయినట్లే !
  4. గోళ్ళు కొరుక్కోవడం ఒక మానసిక బలహీనత.
  5. గోళ్ళను ఎప్పటికప్పుడు కత్తిరించుకుని, శుభ్రపరచు కుంటూ ఉండాలి.
  6. గోళ్ళ దగ్గర చర్మం ఊడినా, చిట్లినా గోరుచుట్టు అయ్యే ప్రమాదం ఉంది. అందుకే గోళ్ళు కత్తిరించుకోగానే డెట్టాల్ వాటర్‌లో ఉంచాలి.
  7. గోళ్ళు నొప్పి చేస్తే పసుపు, సున్నం కలిపి కట్టుకోవాలి. * గోళ్ళకు గోరింటాకు అందాన్ని, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. వీటిని పుచ్చిపోకుండా కూడా కాపాడుతుంది.
  8. గోళ్ళను శుభ్రం చేసుకొని రాత్రి పడుకోబోయే ముందు కోల్డ్ క్రీమ్ రాసుకుంటే ఉదయానికి మృదువుగా తయారవుతాయి.tips for healthy nails
  9. గోళ్ళకు అంటిన మురికి మరకలు పోవాలంటే నిమ్మర
  10. సం రుద్దాలి. ఆ తరువాత కాసేపటికి కోల్డ్ క్రీమ్ రాస్తే గోళ్ళన్నీ శుభ్రం.
  11. గోళ్ళకి నెయిల్ పాలిష్ వేసుకుంటే అందంగా, నాజూగ్గా ఉంటాయి. beautiful naish polish nails
  12.  గోళ్ళు పెళుసుగా ఉంటే గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయను పిండి, ఆ నీళ్ళలో గోళ్ళను 5 నిముషాల పాటు ముంచి ఉంచండి. తరువాత గోళ్ళను తుడిచి నిమ్మచెక్కతో గట్టిగా రుద్ది కాటన్ గుడ్డతో తుడవండి. ఇలా చేస్తే గోళ్ళు శుభ్రపడటమే కాకుండా గట్టిపడతాయి కూడా!
  13. గోళ్ళలో ఏదయినా ఇరుక్కుంటే కొద్దిగా ఫెవికాల్ రాయండి. ఆరగానే పొరను తీసేస్తే దానితోపాటు గుచ్చు కున్నది కూడా బయటకు వస్తుంది. పెట్రోలియం జెల్లీ రాస్తే మృదువుగా తయారవుతాయి.

మన ఆరోగ్యం అంతా గోళ్ళు శుభ్రంగా ఉంచు కోవడంలోనే ఉందని తెలిసిన మీరు కానీ, మరొకర్ని కానీ గోళ్ళు కొరకనియ్యరనే నా నమ్మకం !

మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం చదవండి :

మీ చేతులు మృదువుగా, నాజూకుగా తయారవ్వాలంటే ఏం చేయాలి ?

అందమైన అద్దాల్లాంటి చెక్కిళ్ళు మీకు కావాలంటే ..ఈ చిట్కాలు పాటించండి

శంఖం లాంటి కంఠం మీకుంటే ఎంత అందం? ఇలా చేసి చూడండి ..

-Advertisement-

 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News