Telangana Weather (05-06-2023): ఎండలు, వేడి గాలులతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంచి ముచ్చట చెప్పింది. రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఎల్లో అలర్ట్ జారీ చేశారు.ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మిగిలిన చోట్ల అక్కడక్కడ చిరు జల్లులు కురుస్తాయని వెల్లడించారు. వాతావరణ కేంద్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో, రాబోయే ఏడు రోజులలో గరిష్ట పగటి ఉష్ణోగ్రత 42 నుండి 44 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది.
read more news :
Horoscope (05-06-2023) : ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?