HometelanganaTelangana: దోస్త్‌తో పని లేదు.. 60కి పైగా కాలేజీల్లో అడ్మిషన్లకు అనుమతించిన హైకోర్టు

Telangana: దోస్త్‌తో పని లేదు.. 60కి పైగా కాలేజీల్లో అడ్మిషన్లకు అనుమతించిన హైకోర్టు

Telugu Flash News

Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60కి పైగా కాలేజీల్లో అడ్మిషన్లు చేసుకొనేందుకు హైకోర్టు అనుమతించింది. దోస్త్‌ (కేంద్రీకృత కౌన్సెలింగ్‌) ప్రమేయం లేకుండానే డిగ్రీ అడ్మిషన్లు చేసుకోవచ్చని ఇటీవల హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దోస్త్‌ అడ్మిషన్లకు సంబంధించి గతంలో హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు, పెండింగ్‌లో ఉన్న పిటిషన్ల దృష్ట్యా ఆయా కాలేజీలకు ప్రవేశాలు నిర్వహించుకోవడానికి అనుమతిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.

పిటిషన్లలో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి, విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జూన్ 15వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. మరోవైపు దోస్త్‌ విధానాన్ని సవాల్‌ చేస్తూ ఇప్పటి వరకు దాఖలైన పిటిషన్ల లిస్టును కోర్టు ముందు ఉంచాలని స్పష్టం చేసింది. ఇక దోస్త్‌ ద్వారా ప్రవేశాల కోసం ఈనెల 11వ తేదీన రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ 63కు పైగా ప్రైవేటు కళాశాలలు వేసవి సెలవుల ప్రత్యేక హైకోర్టులో పిటిషన్లు వేశాయి.

ఆయా పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. పిటిషన్ల తరఫున సీనియర్‌ లాయర్‌ వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన కోర్టు దృష్టికి పలు విషయాలు తీసుకెళ్లారు. చాలా వరకు కళాశాలలు సొసైటీ కింద నమోదు చేసుకున్నాయని తెలిపారు. 2015-16కు ముందు దాకా ఆయా కాలేజీలు నోటిషికేషన్లు ఇచ్చి డిగ్రీలో ప్రవేశాలు తీసుకొనేవని పేర్కొన్నారు. అయితే, ఆ తర్వాత విద్యాసంవత్సరంలో ప్రభుత్వం ఎలాంటి నిర్మాణాత్మక, కనీస సంప్రదింపులు లేకుండానే ఆన్‌లైన్‌ ప్రవేశాల ద్వారా కేంద్రీకృత కౌన్సెలింగ్‌.. అంటే దోస్త్‌ ద్వారా ప్రవేశాలు ప్రారంభించిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఆ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయన్నారు. దీంతో ఆన్‌లైన్‌ ద్వారా కామన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించే అధికారం విశ్వవిద్యాలయాలకు లేదని మధ్యంతర ఉత్తర్వులు ధర్మాసం ఇచ్చిందని గుర్తు చేశారు. హైకోర్టులో పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని స్టూడెంట్స్‌కు వివరించి, ఒకవేళ కాలేజీలు కేసు ఓడిపోతే డిగ్రీలు ఉండవన్న విషయాన్ని వారికి తెలియజేయాలని షరతు విధిస్తూ ప్రవేశాలకు అనుమతించిందని వివరించారు.

పిటిషన్లపై విచారణ పూర్తయ్యేందుకు సర్కార్‌ ఆసక్తి చూపలేదన్నారు. దీంతో ఇవి ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి దోస్త్‌తో సంబంధం లేకుండా ప్రవేశాలు కల్పించుకోవడానికి అనుమతించారు.

Read Also : Tirumala: మే 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News