Telangana Budget 2023 : తెలంగాణలో ఎన్నికల ఏడాది కావడంతో రాజకీయాలు ముదురుతున్నాయి. ఈ టర్మ్‌కు ఇదే చివరి బడ్జెట్ కావడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఏ రంగానికి ఎన్ని కేటాయింపులు ఉంటాయి? ఎలా ఖర్చు చేస్తారు? ప్రాధాన్య అంశాలేంటి? తదితర వాటిపై అందరిలోనూ ఉత్కంఠ ఏర్పడింది. ఈ క్రమంలోనే బడ్జెట్ సమయం దగ్గరపడటంతో ఫార్మాలిటీ ప్రకారం గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలు పంపింది కేసీఆర్ సర్కార్.
ఇక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చారు గవర్నర్ తమిళిసై. బడ్జెట్ ప్రతిపాదనలకు గవర్నర్ ఇప్పటి వరకు ఆమోదం తెలపలేదు. దీంతో ప్రభుత్వం భగ్గుమంటోంది. గవర్నర్‌గా తమిళిసై నియామకం జరిగిన నాటి నుంచి ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు అగాధం ఏర్పడింది. పలు సందర్భాల్లో బహిరంగంగానే వ్యాఖ్యలు చేసుకున్నారు. గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారంటూ అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ధ్వజమెత్తుతున్నారు.
ఫిబ్రవరి 3న తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఆరంభమవుతాయి. ఈలోగా బడ్జెట్‌కు ఆమోదం లభించకపోతే ఏం చేయాలన్న దానిపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. తొలి అడుగుగా హైకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. లంచ్ మోషన్ పిటిషన్ వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
అయితే, ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిన వెంటనే ఆమోదించాలనే రూల్ ఏమీ లేదు. అది గవర్నర్ అభిప్రాయం. కాకపోతే ఇప్పటి వరకు ఏ గవర్నర్ కూడా ఇలా వ్యవహరించలేదు. ప్రభుత్వంతో సఖ్యతగానే ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అన్నట్లుగా దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పరిస్థితులు దాపురించాయి.
ఇప్పటికే రెండేళ్లుగా గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు జరిగిపోయాయి. దీనిపై తమిళిసై పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి బడ్జెట్‌కు ఆమోదం తెలిపేది అనుమానమే అని చెబుతున్నారు. ఒక వేళ కోర్టులోనూ సర్కారుకు చుక్కెదురైతే తదుపరి అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రభుత్వ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు.
also read :
Gongadi Trisha : అండర్-19 ప్రపంచ కప్‌లో అదరగొట్టిన తెలుగమ్మాయి
పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 2024 సంక్రాంతికి రిలీజ్ ?
Pawan Kalyan : పవన్, సుజీత్ సినిమాకి సంబంధించిన లీక్.. దానికి ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..!