HometelanganaTelangana Budget 2023 : గవర్నర్‌ ప్రసంగంతోనే బడ్జెట్‌ సమావేశాలు.. రాజ్‌ భవన్‌, ప్రగతిభవన్‌ మధ్య రాజీ!

Telangana Budget 2023 : గవర్నర్‌ ప్రసంగంతోనే బడ్జెట్‌ సమావేశాలు.. రాజ్‌ భవన్‌, ప్రగతిభవన్‌ మధ్య రాజీ!

Telugu Flash News

తెలంగాణ బడ్జెట్‌ (Telangana Budget 2023) సమావేశాలపై వివాదం సద్దుమణిగిందా? కోర్టు జోక్యంతో ఇరు పక్షాలు రాజీకి వచ్చాయా? ఈ వివాదంలో నెగ్గిందెవరు? తగ్గిందెవరు? ఇకపై గవర్నర్ వర్సెస్‌ గవర్నమెంట్‌ అనే రగడ తగ్గుముఖం పడుతుందా? అనే ప్రశ్నలకు కాస్త భిన్నమైన సమాధానాలే వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలతో వివాదం ప్రస్తుతానికి ముగిసినట్లు కనిపిస్తోంది. అయితే, భవిష్యత్‌లో ఇది మరింత ముదిరే అవకాశం కూడా ఉందనిపిస్తోంది.

తెలంగాణ గవర్నర్‌ తన పంతం నెగ్గించుకున్నట్లుగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. రెండేళ్ల నుంచి తనను ప్రభుత్వం అవమానిస్తోందంటూ తమిళిసై వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు తన పంతం నెగ్గించుకున్నట్లయింది. ఇప్పుడు చల్లబడ్డారని విశ్లేషణలు వస్తున్నాయి. అటు సీఎం కేసీఆర్‌ ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో బాగా తెలిసిన వ్యక్తి అని, సమయం చూసుకొని మళ్లీ పంజా విసిరేందుకే ఇప్పుడు రెండడుగులు వెనక్కి తగ్గారంటూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలపై ఆద్యంతం హైడ్రామా ఏర్పడింది. తొలుత బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 3న ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. గడువు దగ్గరపడినా గవర్నర్‌ నుంచి ఆమోదం రాకపోవడంతో ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ఈ ఇష్యూపై హైకోర్టును ఆశ్రయించింది ప్రభుత్వం. దీంతో హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. జనవరి 21న గవర్నర్‌కు లేఖ రాస్తే స్పందించలేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. వెంటనే బడ్జెట్‌కు ఆమోదం తెలపాలని రాజ్‌భవన్‌కు ఆదేశాలివ్వాలని కోరింది.

ఈ నేపథ్యంలోనే గవర్నర్‌కు ప్రభుత్వం విలువ ఇవ్వడం లేదని, గత సమావేశాలు గవర్నర్‌ ప్రసంగం లేకుండానే జరిగాయని గవర్నర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గణతంత్ర వేడుకలకు సీఎం గైర్హాజరు కావడం, మంత్రులు, నేతలు గరవ్నర్‌పై విమర్శలు చేయడాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. అనంతర పరిణామాలతో ప్రభుత్వం పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. గవర్నర్‌ ప్రసంగానికి అంగీకారం తెలిపింది. దీంతో గవర్నర్‌ ప్రసంగంతోనే బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతాయని ప్రభుత్వం తెలిపింది.

also read :

Novak Djokovic : జకోవిచ్‌.. ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే గెలిచి నిలిచాడు!

-Advertisement-

High blood pressure : ఈ 4 జ్యూస్‌లు తాగితే అధిక రక్తపోటును అడ్డుకోవచ్చు!

Pawan Kalyan:  ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూతురిగా బన్నీ కూతురా.. ఏ సినిమాలో ?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News