HometelanganaTelangana Budget 2023 : తెలంగాణ బ‌డ్జెట్ లైవ్ అప్డేట్స్

Telangana Budget 2023 : తెలంగాణ బ‌డ్జెట్ లైవ్ అప్డేట్స్

Telugu Flash News

Telangana Budget 2023 : రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు బడ్జెట్‌ను చదువుతున్నారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండలిలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌కు మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి ఆమోదించింది. 2022 మార్చి 7న రూ.2.71 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.

2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు. పెట్టుబడి వ్యయం రూ.37,525 కోట్లు.

బడ్జెట్‌ వివరాలు ఇలా : 

  • నీటిపారుద‌ల శాఖ‌కు రూ. 26,885 కోట్లు.
  • వ్య‌వ‌సాయానికి కేటాయింపులు రూ. 26,831 కోట్లు.
  • ఆస‌రా పెన్ష‌న్ల కోసం రూ. 12 వేల కోట్లు
  • విద్యుత్ కేటాయింపులు రూ. 12,727 కోట్లు.
  • ద‌ళిత‌బంధు కోసం రూ. 17,700 కోట్లు
  • బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు
  • క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ ప‌థ‌కాల‌కు రూ. 3,210 కోట్లు
  • మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు
  • గిరిజ‌న సంక్షేమం, ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధికి రూ. 15,223 కోట్లు
  • మ‌హిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు.
  • ఎస్సీ ప్ర‌త్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు
  • ఆయిల్ ఫామ్‌కు రూ. 1000 కోట్లు
  • అట‌వీ శాఖ కోసం రూ. 1,471 కోట్లు
  • విద్య రంగానికి రూ. 19,093 కోట్లు
  • వైద్య రంగానికి రూ. 12,161 కోట్లు
  • ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ‌కు రూ. 3,117 కోట్లు
  • హ‌రిత‌హారం ప‌థ‌కానికి రూ. 1471 కోట్లు
  • హోంశాఖ‌కు రూ. 9,599 కోట్లు
  • పంచాయ‌తీ రాజ్‌కు రూ. 31,426 కోట్లు
  • పుర‌పాల‌క శాఖ‌కు రూ. 11,372 కోట్లు
  • రోడ్లు భ‌వ‌నాల శాఖ‌కు రూ. 2,500 కోట్లు
  • ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌కు రూ. 4,037 కోట్లు
  • రైతుబందు ప‌థ‌కానికి రూ. 1575 కోట్లు
  • రైతుబీమా ప‌థ‌కానికి రూ. 1589 కోట్లు
  • కేసీఆర్ న్యూట్రిష‌న్ కిట్ ప‌థ‌కానికి రూ. 200 కోట్లు
  • ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మానికి రూ. 4,834 కోట్లు
  • రుణ‌మాఫీ ప‌థ‌కానికి రూ. 6,385 కోట్లు
  • ఆరోగ్య శ్రీ ప‌థ‌కానికి రూ. 1463 కోట్లు
  • ప్ర‌ణాళిక విభాగానికి రూ. 11,495 కోట్లు
  • డ‌బుల్ బెడ్రూం ఇండ్ల ప‌థ‌కానికి రూ. 12,000 కోట్లు
  • ఐటీ, క‌మ్యూనికేష‌న్ల శాఖ‌కు రూ. 366 కోట్లు
  • కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకానికి రూ. 3,210 కోట్లు
  • ఉన్నత విద్యా శాఖకు రూ. 3,001 కోట్లు
  • ప్రణాళిక విభాగానికి రూ. 11,495 కోట్లు
  • న్యాయ శాఖకు రూ. 1,665 కోట్లు
  • ఐటీ కమ్యూనికేషన్ల శాఖకు రూ. 366 కోట్లు
  • ఎయిర్‌పోర్టు మెట్రో కనెక్టివిటీ కోసం రూ. 500 కోట్లు
  • జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 100 కోట్ల కార్పస్‌ ఫండ్‌
  • ఆసరా పెన్షన్ల కోసం రూ.12,000 కోట్లు
  • కొత్తగా నియమించే ఉద్యోగుల జీతభత్యాలకు రూ. 1000 కోట్లు
  • ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ. 3,117 కోట్లు
  • దళిత బంధుకు రూ.17,700 కోట్లు
  • మెట్రో రైల్‌ ప్రాజెక్టు కు రూ. 1500 కోట్లు
  • పల్లె ప్రగతి, పంచాయతీ రాజ్‌ శాఖకు రూ. 31,426 కోట్లు
  • యూనివర్సిటీల అభివృద్ధికి రూ. 500 కోట్లు
  • స్పెషల్ డెవలప్‌మెంట్‌ ఫండ్‌కు రూ.10,348 కోట్లు
  • ఓల్డ్ సిటీ మెట్రో రైలు కనెక్టివిటీ కోసం రూ. 500 కోట్లు
  • మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధికి రూ. 200 కోట్లు
  • యాదాద్రి డెవలప్‌మెంట్‌ అథారిటీ కోసం రూ. 200 కోట్లు
  • కాళేశ్వరం టూరిజం సర్క్యూట్‌ కోసం రూ. 750 కోట్లు
  • ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి రూ. 1500 కోట్లు
  • సుంకేశుల ఇన్‌టెక్‌ ప్రాజెక్టు కోసం రూ. 725 కోట్లు
  • మహిళా వర్సిటీకి రూ. 100 కోట్లు
  • ఎస్సీ సంక్షేమ శాఖకు రూ. 21,022 కోట్లు

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News