HometelanganaTelangana BJP : కేసీఆర్‌ను గద్దె దించుతాం.. అమిత్‌షాతో తెలంగాణ బీజేపీ నేతలు

Telangana BJP : కేసీఆర్‌ను గద్దె దించుతాం.. అమిత్‌షాతో తెలంగాణ బీజేపీ నేతలు

Telugu Flash News

తెలంగాణ బీజేపీ (Telangana BJP) నేతలకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో 15 మంది ముఖ్య నేతలు హస్తినకు వెళ్లారు. అక్కడ బీజేపీ ముఖ్య నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా తెలంగాణలో రాబోతున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కార్యాచరణ, దూకుడు పెంచాలని అమిత్‌ షా దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాది చివర్లో ఎన్నికలు ఉండటం, ముందస్తు సంకేతాలూ వెలువడుతుండడంతో తెలంగాణపై బీజేపీ ఫోకస్‌ పెంచింది.

అమిత్‌ షాతో భేటీ సందర్భంగా తెలంగాణ బీజేపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతం చేస్తామని, కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగిన ఈ మినీ కోర్‌ కమిటీ భేటీలో.. తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. భేటీ అనంతరం తరుణ్‌ చుగ్‌ మీడియాతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరుతామని చెప్పారు.

పార్టీ సంస్థాగత వ్యవహారాలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సుదీర్ఘంగా చర్చించినట్లు తరుణ్‌ చుగ్‌ తెలిపారు. ఎన్నికలపై తగిన ప్రణాళికతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉన్నామని తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ పేర్కొన్నారు.

బీజేపీకి అభ్యర్థులే లేరని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో మొత్తం 119 స్థానాల్లోనూ పోటీ చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు తెలిపారు.

-Advertisement-

అమిత్ షాతో జరిగిన భేటీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, అర్వింద్, పార్టీ ముఖ్య నేతలు మురళీధర్ రావు, డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, విజయశాంతి, ఇంద్రసేనారెడ్డి, జితేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది.

కొందరు కాంగ్రెస్‌ నేతలు బీఆర్ఎస్‌తో పొత్తుకు సంకేతాలిస్తుండటం బీజేపీకి కలిసి వచ్చే అంశంగా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ ఒక్కటేనని ప్రచారం చేయాలంటూ అధిష్టానం బీజేపీ తెలంగాణ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది.

also read :

Actress Pooja Hegde at Zee Cine Awards 2023 Event

Kiara Advani at Zee Cine Awards 2023 Photos and Videos

Rashmika Mandanna at Zee Cine Awards 2023 Photos and Videos

Sunny Leone Latest Photos, Stills, images 2023

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News