Supreme Court : అమరావతి రాజధానిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, దీనిపై కోర్టుల్లో కేసుల కారణంగా ఇప్పటి వరకు కార్యాచరణ ముందుకు సాగలేదు. తాజాగా గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన పేదలకు సుప్రీంకోర్టులో గొప్ప ఊరట దక్కింది. అమరావతి రాజధానిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే ముఖ్యమంత్రి జగన్ సంకల్పాన్ని అడ్డుకొనేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందనే ఆరోపణలు అధికార పార్టీ గుప్పించిన నేపథ్యంలో ఆ చర్యలకు బ్రేకులు పడినట్లయింది.
ఈ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మీకు చెందిన 35 సెంట్ల భూమి నుంచి పేదలకు స్థలం ఇస్తున్నామా?.. 75 వేల మంది పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడం వల్ల మీకు ఇందులో వచ్చే నష్టం ఏమిటంటూ పిటిషనర్లపై అత్యున్నత ధర్మాసనం ప్రశ్నలు గుప్పించినట్లు తెలుస్తోంది. పిటిషనర్‌పై సీరియస్ కావడంతో ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది.
మరోవైపు అమరావతిలో పేదలకు ఇంటి స్థలాల కేటాయింపు అంశంపై స్టే ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌ను విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో చేసేది లేక పిటిషనర్ అయిన టీడీపీ సానుభూతిపరుడు పిటిషన్‌ను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
అమరావతి రాజధాని ప్రాంతాల్లో వేలాది మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ ప్రయత్నాలను ప్రతిపక్షం అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తోందని అధికార పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. అమరావతి రాజధానిలో పేదలకు స్థానం దక్కకూడదని కుట్ర చేశారని, అందుకే కోర్టుల్లో పిటిషన్లు వేశారని నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో విచారణ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలన్న జీవోపై స్టే ఇవ్వాలని అడిగారని, మీకు ప్లాట్లు ఇస్తున్నప్పుడు దీన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని సుప్రీం కోర్టు అడిగినట్లు సమాచారం. పిటిషన్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.
పేదలకు సెంట్ భూమి ఇస్తే ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు పిటిషనర్ సమాధానం చెప్పలేక, గత్యంతరం లేక చివరకు పిటిషన్ విత్ డ్రా చేసుకున్నారు. సీఆర్‌డీఏ చట్టం ప్రకారం పేదలకు 5 శాతం ఇళ్ల స్థలాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి తెలిపారు. దీనిపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
also read :
Mahesh-Rajamouli : బాబోయ్.. మూడు పార్ట్‌లుగా మహేష్-రాజమౌళి మూవీ..!