Homehealthsuper foods : చలికాలంలో మీ ఆరోగ్యం కోసం ఈ 5 సూపర్ ఫుడ్స్

super foods : చలికాలంలో మీ ఆరోగ్యం కోసం ఈ 5 సూపర్ ఫుడ్స్

Telugu Flash News

చలికాలంలో, నీరసంగా అనిపించడం, ఎక్కువగా నిద్రపోవడం, శక్తి తగ్గడం సర్వసాధారణం. అలాగే, మీ శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచే కొన్ని ఆహారాలను మీకు తినాలనిపించచ్చు’ అని డైటీషియన్ మరియు ఫిసికో డైట్ క్లినిక్ వ్యవస్థాపకురాలు విధి చావ్లా అన్నారు.

సూపర్ ఫుడ్స్ (super foods)

మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి మరియు ఈ శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి ఈ సూపర్ ఫుడ్స్ తీసుకోవడం అవసరం.

1. సూప్‌లు

వేడి వేడి సూప్ ఈ చలికాలంలో వెంటనే శక్తిని ఇస్తుంది, మాములుగా తినాల్సిన సమయం దాటుతున్నా ఈ కలలో చాలామందికి ఆకలి వేయదు అటువంటప్పుడు ఇది తినే ముందు తాగితే ఆకలి వేస్తుంది. అవి విటమిన్లు, మినరల్స్ మరియు ఇతర పోషకాలతో కూడా నిండి ఉంటాయి, మీ పిల్లలకు కూరగాయలు తినడం ఇష్టం లేకుంటే, వాటిని సూప్స్ లో వేసి ఇవ్వచ్చు. జీలకర్ర, అల్లం లేదా దాల్చినచెక్క లాంటి మసాలా మసాలాలను కూడా జోడించచ్చు. సూప్‌లు కేలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు చలికాలంలో దాహం ఎక్కువ ఉండదు కాబట్టి నీటిని కూడా తక్కువ తీసుకునే అవకాశం ఉంది అది డీ హైడ్రేషన్ కు దారి తీస్తుంది, అందుకే ఇలా సూప్ తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన నీరు కూడా అందుతుంది.

2. చిలగడదుంపలు

చిలగడదుంపలలో విటమిన్ సి మరియు బీటా-కెరోటిన్‌లు అధికంగా ఉంటాయి, అవి శరీర దృఢత్వాన్నిపెంచడంలో సహాయపడతాయి. చలికాలంలో చర్మానికి కూడా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఇది ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి సహాయపడుతుంది ఇంకా చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.

3. డ్రై ఫ్రూట్స్

ఖర్జూరాలు, జీడిపప్పు, బాదం పప్పులు, వాల్‌నట్‌లు మరియు వేరుశెనగలను తీసుకోవడం వీటిల్లో అధిక పోషకాలు మరియు విటమిన్‌లు ఉన్నాయి. శరీర ఉష్ణోగ్రతను పెంచడంలో సహాయపడుతుంది. బాదంపప్పును పాలతో కలిపి తీసుకోవడం వల్ల చలికాలంలో జలుబు రాదు. నట్స్‌లో విటమిన్ సి ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించి దగ్గు మరియు జలుబును దూరం చేస్తుంది. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి చర్మాన్ని మృదువుగా మార్చడం వల్ల పొడి చర్మం ఉన్నవారు వీటిని వాడడం మంచిది.

4. ఆకు కూరలు

ఆ సమయంలో శరీరంలోని వేడిని పెంచడానికి ఆకూ కూరల వాడకం పెంచాలి. ఇటువంటి కూరగాయలు పొటాషియం, విటమిన్లు మరియు ప్రోటీన్లతో నిండి ఉంటాయి. “జలుబు మరియు దగ్గు నుండి దూరంగా ఉండటానికి మీ ఆహారంలో బచ్చలికూర,క్యాబేజీని చేర్చండి, అవి మీ శరీరంలో ఐరన్ స్థాయి మరియు ఎముక సాంద్రతను కూడా పెంచడానికి సహాయపడతాయి,” అని చావ్లా చెప్పారు.

-Advertisement-

5. నెయ్యి

నెయ్యి మీ శరీరాన్ని లోపల నుండి చల్లగా ఉంచుతుంది. నెయ్యి యొక్క వినియోగం రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది మరియు జలుబు మరియు దగ్గు నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. నెయ్యి శరీరానికి మంచి కొవ్వు కాబట్టి ఆహారంలో తరుచుగా వాడటం వల్ల చలికాలంలో ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవచ్చు. జుట్టు మరియు చర్మానికి కూడా నెయ్యి శీతాకాలంలో చాలా మంచిది, అయితే నెయ్యి అతిగా వినియోగించకూడదు అవసరం అయినంత మేరకే వాడుకోవాలి.

also read news:

చుండ్రు చికాకు పెడుతుంటే… ఈ చిట్కాలు పాటించండి

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News