విటమిన్లు అధిక మొత్తంలో తీసుకుంటే శరీరానికి నష్టం కూడా ఉంది. అమెరికాలోనైతే ఏటా నాలుగు వేల మంది విటమిన్ ప్రియులు వివిధ రకాలైన జబ్బులకు లోనవుతున్నారట! దీన్నే “విటమిన్ పాయిజనింగ్” (Vitamin Poisoning) అంటున్నారు.
విటమిన్లు ఎక్కువవటం వల్ల భోజనం సహించకపోవడం, వాంతులు, తలనొప్పి, చర్మం ఎండగట్టిపోవటం వంటి దుష్ఫలితాలు కలుగుతాయి. శరీరాన్ని ధ్వంసం చేస్తాయి. ఎదుగుదలను ఆపేస్తాయి.
ప్రజల్లో విటమిన్లు ఆహారానికి ప్రత్యామ్నాయ పదార్థాలనే భావన ఉంది. అది నిజం కాదు. రోజూ వారీ మనిషికి కావల్సిన విటమిన్లు చాలా తక్కువ. పోషక విలువలు బాగా తక్కువ ఆహారం తీసుకున్న వారిలో తప్ప విటమిన్ల లోపం రాదు. అలా లోపం వచ్చిన వారికి కూడా విటమిన్లు ఇవ్వాల్సింది అతి తక్కువ మోతాదులోనే తప్ప గుట్టలు గుట్టలుగా కాదు. బలమెక్కువ వస్తుందని ఆశపడి మింగినా అవి బలోపేతం చేసేది మనిషిని కాదు, సైడు కాలువల్ని ! మందుల కంపెనీల్ని !! శరీరం వినియోగించుకోవల్సినంతే వినియోగించుకొంటుంది. మిగతా విటమిన్లన్నీ మూత్రంలో కలిసి డ్రైనేజీ లోనికి పోతాయి.
దానిమ్మ గింజల్లాంటి దంతాలు మీ సొంతం కావాలంటే ఈ టిప్స్ పాటించండి..
Weight Loss Tips : బరువు తగ్గడానికి పంచౌషధాలు..