HometelanganaSatvik Suicide Case : సాత్విక్‌ ఆత్మహత్య రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు

Satvik Suicide Case : సాత్విక్‌ ఆత్మహత్య రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు

Telugu Flash News

హైదరాబాద్‌లోని నార్సింగి శ్రీచైతన్య కాలేజీ (sri chaitanya college) లో విద్యార్థి సాత్విక్‌ ఆత్మహత్య (satvik suicide) కు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసు రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. కాలేజీలో వేధింపులు, ఒత్తిడి వల్లే సాత్విక్‌ బలవన్మరణం చెందాడని రిమాండ్‌ రిపోర్టులో వెల్లడైంది. తోటి విద్యార్థుల ముందు సాత్విక్‌ను ఘోరంగా అవమాన పర్చారని తేలింది. ఏకంగా బూతులు తిట్టడం, కొట్టడం లాంటివి చేయడంతో విద్యార్థి మనస్తాపం చెందినట్లు రిమాండ్‌ రిపోర్టులో వెల్లడైంది.

ప్రిన్సిపల్‌ ఆచార్య కృష్ణారెడ్డి తరచూ విద్యార్థి సాత్విక్‌ను తిట్టేవాడని తెలుస్తోంది. ఆత్మహత్యకు పాల్పడే ముందు రోజు కూడా స్టడీ అవర్లో సాత్విక్‌ను ఆచార్య, ప్రిన్సిపల్‌ ఇద్దరూ చితకబాదినట్లు రిపోర్టులో తేలింది. హాస్టల్‌లో కూడా సాత్విక్ను వార్డెన్‌ వేధింపులకు గురి చేసినట్లు రిపోర్ట్‌ క్లారిటీ ఇచ్చింది. దీంతో కాలేజీ యాజమాన్యం వేధింపులతోనే సాత్విక్‌ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీఉలు నిర్ధారణకు వస్తున్నారు.

విచారణలో భాగంగా తోటి విద్యార్థులను ప్రశ్నించగా.. పలు సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆత్మహత్య చేసుకొనే ముందు రోజు సాత్విక్‌ను చూసేందుకు తల్లిదండ్రులు వచ్చినట్లు తెలుస్తోంది. వారు వెళ్లిన తర్వాత స్టడీ అవర్‌లో లెక్చరర్‌ ఆచార్య, ప్రిన్సిపల్‌ కృష్ణారెడ్డి కలిసి సాత్విక్‌ను చితకబాదినట్లు విద్యార్థులు చెబుతున్నారు. దాంతోపాటు సాత్విక్‌ ఇంట్లో వాళ్లను కూడా బూతులు తిట్టారని, ఆచార్య, కృష్ణారెడ్డిల తీరుపై స్టూడెంట్స్ సంచలన విషయాలు బహిర్గతం చేశారు.

వీరిద్దరితో పాటు విద్యార్థి సాత్విక్‌ను హాస్టల్‌ వార్డెన్‌ కూడా వేధించేవాడని గుర్తించారు. ఈ రకంగా కాలేజీ యాజమాన్యం అన్ని వైపుల నుంచి ప్రెజర్‌ పెంచడంతోనే ఇవన్నీ భరించలేని సాత్విక్‌ తనువు చాలించేందుకు నిర్ణయం తీసుకున్నాడని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో వెల్లడించారు. ఇక సాత్విక్‌ ఆత్మహత్య కేసుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటర్‌ బోర్డు విచారణ కమిటీ రిపోర్టులో కూడా కీలక విషయాలు వెలుగు చూశాయి. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్ కాలేజీలో సాత్విక్‌కు అడ్మిషన్‌ లేదని వెల్లడైంది. ఓ కాలేజీలో ప్రవేశం తీసుకొని క్లాసులు మరో కాలేజీలో నిర్వహిస్తున్నారని తేలింది. మరోవైపు అడ్మిషన్ల సమయంలో నార్సింగిలోని కాలేజీ పేరుతోనే తమకు రిసిప్ట్‌ ఇచ్చారని సాత్విక్‌ తల్లిదండ్రులు చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

also read : 

Chiranjeevi: చిరంజీవి చెంప కందిపోయేలా కొట్టిన హీరోయిన్.. అస‌లేమైంది..!

-Advertisement-

Sobhita Dhulipala hot instagram pics, photos, images 2023

Nani: నాని మాస్ లైన‌ప్ మాములుగా లేదుగా.. ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిపోవాల్సిందే..!

Shruti Haasan hot and stylish black dress photos 2023

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News