HomecinemaSamantha Hot Video : సెర్బియా పబ్ లో ఆ హీరో తో సమంత స్టెప్పులు.. వీడియో వైరల్

Samantha Hot Video : సెర్బియా పబ్ లో ఆ హీరో తో సమంత స్టెప్పులు.. వీడియో వైరల్

Telugu Flash News

Samantha Hot Video : టాలీవుడ్ హీరోయిన్ సమంత కెరీర్ రాకెట్ వేగంతో దూసుకువెళ్తుంది. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌కి ఎంత ఆదరణ లభించిందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ సిరీస్‌తో సమంత హిందీ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇప్పుడు రాబోయే మరో సిరీస్ “సిటాడెల్”తో మరింత అలరించడానికి ప్రయత్నిస్తుంది.

అయితే ఈ వెబ్ సిరీస్‌లకు ముందు.. విడాకులు తీసుకున్న వెంటనే పుష్ప సినిమాలోని ఊ అంటావా ఊహూ అంటావా అనే పాటకు డ్యాన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. అయితే ఆ పాట సూపర్ హిట్ అయింది. ఆ పాటతో సమంత క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఇంత క్రేజ్ తెచ్చుకున్న ఈ పాటకు సమంత తాజాగా మరోసారి స్టెప్పులేసింది.

samantha in pub with varun dhawanసమంత ప్రస్తుతం ఇండియన్ వెర్షన్ సిటాడెల్ షూటింగ్‌లో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ షూటింగ్ సెర్బియాలో జరుగుతోంది. అందుకోసం అక్కడికి వెళ్లిన ఆమె చిత్ర బృందంతో కలిసి అక్కడి ఓ పబ్‌కి వెళ్లింది. ఆ పబ్‌లో ఊ అంటావా ఊహు అంటావా అనే పాటకు వరుణ్ ధావన్‌తో కలిసి స్టెప్పులు వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఇదిలా ఉంటే సమంత చెన్నై స్టోరీ అనే హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా చేస్తోంది. ఆమె మరిన్ని హాలీవుడ్ ప్రాజెక్ట్‌లు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు ఆడిషన్స్ కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్‌లో పెద్ద దర్శకులు మరియు నిర్మాణ సంస్థలు స్టార్ నటులను కూడా ఒక నిర్దిష్ట పాత్ర కోసం ఆడిషన్ టేపులను పంపమని అడగడం సర్వసాధారణం. సమంత కూడా ఆడిషన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరోవైపు సమంత ఖుషీ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. సమంత నటించిన మజిలీ సినిమా కి కూడా శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

-Advertisement-

read more news :

Summer Crush Samantha Recent Photo Gallery

Samantha: స‌మంత‌పై ప్ర‌శంస‌లు కురిపించిన సానియా మీర్జా.. కార‌ణం ఏంటంటే..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News