HomesportsRizwan: భార‌త్‌పై గెలుపు త‌ర్వాత ఏ షాపు వాళ్లు నా ద‌గ్గ‌ర నుండి డ‌బ్బులు తీసుకోవ‌ట్లేద‌న్న క్రికెట‌ర్

Rizwan: భార‌త్‌పై గెలుపు త‌ర్వాత ఏ షాపు వాళ్లు నా ద‌గ్గ‌ర నుండి డ‌బ్బులు తీసుకోవ‌ట్లేద‌న్న క్రికెట‌ర్

Telugu Flash News

Rizwan: పాకిస్తాన్ వ‌న్డే ఓపెన‌ర్ మహ్మద్ రిజ్వాన్ మూడు ఫార్మాట్స్‌లోను అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తూ మొన్న‌టి వ‌ర‌కు టీ20 ల‌లో నెంబ‌ర్ 1 బ్యాట‌ర్‌గా కొన‌సాగాడు. ఇప్పుడు సూర్య కుమార్ యాద‌వ్ తొలి స్థానం ద‌క్కించుకోవ‌డంతో రిజ్వాన్ రెండో స్థానానికి ప‌డిపోయాడు. అయితే బాబర్ ఆజమ్‌తో కలిసి రిజ్వాన్ త‌మ జ‌ట్టుకి ఎన్నో అద్భుత‌మైన విజ‌యాలు అందించారు. గత ఏడాది టీ20 వరల్డ్ కప్‌లోను ఈ జోడి సత్తా చాటారు. బాబర్‌-రిజ్వాన్ జోడీ అనేక సందర్భాల్లో అద్భుత భాగస్వామ్యాలను నెలకొల్పింది.2021లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌పై పది వికెట్ల తేడాతో పాకిస్థాన్ విజయం సాధించాడాన్ని మ‌నోళ్లు జీర్ణించుకోలేక‌పోతుండ‌గా, పాకీస్తానీయులు మాత్రం ఇప్ప‌టికీ గుర్తుంచుకొని మ‌రీ ఆనందాన్ని పొందుతున్నారు.

గ‌త ఏడాది అక్టోబర్ 24న జరిగిన ఆ మ్యాచ్‌లో కోహ్లి సేన 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేయగా.. బాబర్ ఆజమ్ (69 నాటౌట్), మహ్మద్ రిజ్వాన్ (79 నాటౌట్) అజేయంగా నిలవడంతో మరో 13 బంతులు మిగిలి ఉండగానే పాక్ భార‌త్‌పై ఘన విజయం సాధించింది.అయితే ఈ విజ‌యం తన జీవితాన్ని మార్చేసిందని మహ్మద్ రిజ్వాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘‘భారత్‌పై మేం గెలుపొందాం. ఆ సమయంలో నా దృష్టిలో అది మ్యాచ్ మాత్రమే. మేం తేలిగ్గా విజయం సాధించాం. కానీ పాకిస్థాన్ తిరిగొచ్చాక.. ఆ గెలుపు విలువేంటో నాకు తెలిసింది. నేను ఏ షాప్‌కు వెళ్లినా దుకాణాదారులు నా దగ్గర్నుంచి డబ్బులు తీసుకోవ‌డం లేదు.. ‘నువ్వు వెళ్లులే.. నీ దగ్గర డబ్బులు తీసుకోను’ అని చెబుతున్నారంటూ రిజ్వాన్ చెప్పుకొచ్చాడు.

‘నీకు ఏం కావాలన్నా ఫ్రీగా తీసుకో’ అనేవాళ్లు. భారత్‌తో మ్యాచ్ తర్వాత అంతటి ప్రేమను నేను పాకిస్థాన్ నుంచి పొందానంటూ రిజ్వాన్ వ్యాఖ్యానించాడు. అయితే గత ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో పాక్ చేతిలో ఓడిన టీమిండియా ఈ ఏడాది గెలిచి లెక్క సరి చేసింది. విరాట్ కోహ్లి వీరోచిత బ్యాటింగ్‌తో ఆఖరి బంతికి భారత్ విజయం సాధించింది. ప్ర‌స్తుతం రిజ్వాన్ ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతున్నాడు. రావల్పిండి, ముల్తాన్ టెస్టుల్లో గెలిచిన ఇంగ్లిష్ జట్టు.. కరాచీ టెస్టు మిగిలి ఉండగానే పాక్‌ను 2-1 తేడాతో ఓడించి సిరీస్ చేజిక్కించుకుంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News