Homeandhra pradeshYS Jagan: జగన్‌ చేతిలో ఆ ఎమ్మెల్యేల జాతకం.. 20 మందికి పైగా మార్పు ఖాయమా?

YS Jagan: జగన్‌ చేతిలో ఆ ఎమ్మెల్యేల జాతకం.. 20 మందికి పైగా మార్పు ఖాయమా?

Telugu Flash News

ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS jagan mohan reddy) అలర్ట్‌ అయినట్లు కనిపిస్తోంది. బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్న జగన్‌.. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పనితీరు తెలుసుకోవాల్సిన బాధ్యతను నియోజకవర్గాల శాసనసభ్యులకు అప్పగించారు. ఈ క్రమంలో గడప గడపకూ మన ప్రభుత్వం పేరిట ప్రతి ఇంటినీ, ప్రతి లబ్ధిదారుడినీ పలకరించాలని జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఏడాదిగా ఈ కార్యక్రమం జోరుగా సాగుతోంది.

అయితే, ఎంత మంది ఎమ్మెల్యేలు జగన్‌ మాటను ఆచరిస్తున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రతి నెలలో కనీసం 3 సచివాలయాలకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలు ఈ సూచనను లైట్‌ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి తాజాగా నివేదికలు తెప్పించుకున్నారట. ఎవరు ఎన్ని రోజులు ప్రజల వద్దకు వెళ్లారో జాబితా ఆయన వద్దకు చేరింది. పనితీరు మెరుగ్గా ఉన్న ఎమ్మెల్యేలకు అభినందనలు, సక్రమంగా లేని వారికి హెచ్చరికలు చేస్తున్నారు జగన్‌.

గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ఆధారంగానే నేతలకు ర్యాంకింగ్‌ ఇస్తున్నారు జగన్‌. ఇందులో 20 మందికి పైగా ఎమ్మెల్యేల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని తేలిందట.

పనితీరు, ప్రజాభిప్రాయం, సర్వేలే కొలమానంగా ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు చేస్తానని జగన్‌ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఈ ఏడాది మే నుంచి ఇప్పటి వరకు జరిగిన గడప గడపకు కార్యక్రమంపై జగన్‌ రివ్యూ మీటింగ్‌ చేపట్టారు.

గ్రాఫ్‌ ఎలా ఉందోనని ఎమ్మెల్యేల్లో టెన్షన్‌..

జగన్‌ సమీక్ష నేపథ్యంలో చాలా మంది ఎమ్మెల్యేల్లో టెన్షన్‌ నెలకొంది. తమ ర్యాకింగ్‌ ఎలా ఉందోనన్న ఆందోళన వారిలో ఉంది. టికెట్‌ కన్ఫం అవుతుందా? లేక పక్కదారి చూసుకోవాలా? అని ఆలోచనలో పడ్డారు.

-Advertisement-

నెలలో 20 రోజులపాటు గ్రామాల్లో పర్యటించాలని స్పష్టం చేయడంతో అసలు తిరగని వారిలో గుబులు పట్టుకుంది. ఈసారి టికెట్‌ వచ్చేది అనుమానమేనంటూ స్తబ్ధుగా ఉంటున్నారు.

పనితీరు సరిగా లేకపోతే ఇవ్వలేనని జగన్‌ నిర్మొహమాటంగా చెప్పేస్తుండడంతో వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్లు దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

also read news:
JP Nadda: నడ్డా పర్యటనతో వేడెక్కిన తెలంగాణ రాజకీయం.. బీజేపీ కార్యాచరణ ఎలా ఉండబోతోంది?

Shahrukh Khan: బేషరం హాట్‌ సాంగ్‌ విమర్శలపై షారుఖ్‌ కౌంటర్‌.. ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఏమన్నాడంటే..!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News