టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అభివృద్ధితో ఇండియాకి మంచి పేరు తెచ్చిన,అందరూ మెచ్చిన రతన్ టాటా (ratan tata) గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా…..అయితే ఇది చదవాల్సిందే.
రతన్ టాటా 1937,డిసెంబర్ 28న ముంబైలో నవాల్ టాటాకు జన్మించగా, 10 ఏళ్ల వయసులోనే ఆయన తల్లిదండ్రులు విడిపోవడంతో నవాజ్ బాయి టాటా దత్తతు తీసుకుని తన ఆలనా పాలనా చూసుకున్నారు.
చిన్నతనం నుంచి చదువులో ముందుంటూ వచ్చిన టాటా కార్నెల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో బ్యాచిలర్స్ డిగ్రీని పొంది, 1975లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో మేనేజ్మెంట్ కోర్సుని (management course) పూర్తిచేసారు.
అదే విధంగా 1961లో అంటే తన చదువు పూర్తి కాక మునుపే టాటా స్టీల్ లో షాప్ ఫ్లోర్ లో పని చేరిన రతన్ టాటా,తన చదువు పూర్తయిన తరువాత తన దృష్టినంతా టాటా గ్రూప్ ని అభివృధి పరచడంలోనే పెట్టి అనతి కాలంలోనే ఎవరూ ఊహించని స్థాయికి చేరారు.
తను టాటాలో చేరిన కొన్నెళ్లకే మేనేజర్ పదవిని దక్కించుకున్నారు. 1991లో జే.అర్.డి టాటా చైర్మన్ గా దిగిపోయిన తరువాత రతన్ టాటాని వారసుడిగా, ఆయన తరువాత చైర్మన్ పదవికి అర్హుడిగా ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
అలా చైర్మన్ పదవిని చేజిక్కించుకున్న రతన్ టాటా మొదట్లో కంపెనీని నడపడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నప్పటికీ ఆ తరువాతి కాలంలో టెట్లే(Tetley), జాగ్వర్ లాండ్ రోవర్(Jaguar Land Rover),కోరస్ (corus) లాంటి కంపెనీలను టాటా గ్రూప్ సొంతం చేసుకోవడంలో ముఖ్య పాత్రను పోషించారు.
టైటాన్, తనిష్క్ లాంటి కంపెనీలను స్థాపించారు. ఎలక్ట్రిక్ కార్లను ఇండియాకి పరిచయం చేశారు. అప్పటి వరకు కేవలం ఇండియాకి మాత్రమే పరిమితం అయిన టాటా గ్రూప్ ని ప్రపంచానికి తెలిసేలా,ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగేలా చేశారు.
ఎంత డబ్బు సంపాదించినా మనుషులలో ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలని,ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలని చెప్తుంటారు రతన్ టాటా.
దాన్ని మాటలకు మాత్రమే పరిమితం కానివ్వకుండా చేతలలోనూ చూపించే టాటా ప్రతి ఏడాది తన జీతంలో 60-65 శాతాన్ని విరాళంగా ఇస్తుంటారు.
విద్యార్థులే భారత దేశ భవిష్యత్తుకి దీపాలు అని నమ్మే టాటా కార్నెల్ యూనివర్సిటీకి 28 మిలియన్ డాలర్లను విరాళంగా అందజేశారు.
అదే విధంగా ప్రతి ఏడాది టాటా కన్సల్టెన్సీ (TCS) ద్వారా ప్రతి ఏడాది వేల మంది విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు.
అలాంటి మంచి మనసున్న గొప్ప వ్యక్తి రతన్ టాటా గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరిన్ని వార్తలు చదవండి :
తెలంగాణ వార్తలు | జాతీయ వార్తలు | సినిమా వార్తలు | అంతర్జాతీయ వార్తలు | ఆరోగ్య చిట్కాలు