Rashmika: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవలి కాలంలో వరుస ఫ్లాపులని చవి చూస్తున్నాడు. అయినప్పటికీ ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. కొన్నాళ్లుగా విజయ్ .. రష్మికతో ప్రేమాయణం విషయంలో వార్తలలో నిలుస్తూ వస్తున్నాడు.
ఈ ఇద్దరు పార్టీలలో కలిసి కనిపించడం, వెకేషన్‌కి సేమ్ ప్లేస్‌కి వెళుతున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందని అందరు అనుకుంటున్నారు. అయితే ఖుషీ సినిమా సమయంలో విజయ్.. రష్మిక బ్రేకప్ చెప్పి సమంతకి క్లోజ్‌గా ఉంటున్నారని ఓ పుకార్ వినిపించింది.
ఇక ఇప్పుడు మరో కొత్త రూమర్ వినిపిస్తుంది. రష్మిక మందన్నా ఓ తెలుగు హీరోతో ప్రేమలో పడిందని పుకారు నెట్టింట వైరల్‌గా మారింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో రష్మిక ఇటీవల తరచూ కనిపిస్తుంది. ఇటీవల ఓ ఈవెంట్లో ఇద్దరు కలిసి పాల్గొన్నారు.
అక్కడ చాలాక్లోజ్‌గా కూడా మూవ్ అయ్యారు.దాంతోనే అందరికి అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. అంతేకాదు ఈ ఇద్దరు కలిసి ఎయిర్ పోర్ట్ లోనూ సందడి చేయగా, వారిద్దరు కలిసి వెళ్తున్న ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈఇద్దరు కలిసి సినిమా చేసింది లేదు, కలిసిన సందర్భం కూడా లేదు… మొదటిసారి కలిసి మీడియాకి చిక్కడంతో రూమర్స్ వైరల్‌గా మారాయి.
also read :
Rashmika Mandanna at Zee Cine Awards 2023 Photos and Videos