Rashmika Mandanna : కన్నడ బ్యూటీ, కుర్రాళ్ల మదిని దోచిన సుందరి , క్యూట్ అండ్ బబ్లీ పిల్ల , నెట్టింట చాలా చురుకుగా ఉండే ఈ శ్రీవల్లీ ఈ మద్యనే ఒక యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసింది. సోషల్ మీడియా లో తెగ ఫాలోయింగ్..ఇన్‌స్టాగ్రామ్‌లో లో కూడా ఈ అమ్మడికి మాంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే 30 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. నటిగా చాలానే సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. వరస సినిమాల సక్సెస్ తో ఎంజాయ్ చేస్తుంది. తన యూట్యూబ్ చానెల్ లో ఒక వీడియో అప్ లోడ్ చేసింది.ఇంకేముంది రకరకాల ప్రశ్నలకు సమాదానమిచ్చింది.
Rashmika Mandanna తనకు యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టమని చెప్పింది, ఎందుకంటే నటన నన్ను నేను తెలుసుకోవడంలో సహాయపడుతుంది. ఇంకా తనకి డాన్స్, ట్రావెలింగ్ చాలా ఇష్టమని, వీలుకుదిరినప్పుడల్లా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటానని, టూర్స్ కి వెళ్తుంటానని తనకి బెర్లిన్, ఇటలీ, రష్యా, పారిస్, ఫేవరెట్ ప్లేసెస్ అని చెప్పింది. ఇంకా desserts అంటే పడి చచ్చిపోతానని , రోజూ వర్కౌట్ చేయకుండా ఉండలేనని అభిమానులతో ఈ విషయాలు పంచుకుంది.
అయితే అన్ని ప్రశ్నలకు సమాదానమిచ్చిన Rashmika Mandanna తన ఎక్స్ లవ్, బ్రేక్అప్ గురించి మాత్రం చెప్పలేదు.కన్నడ నటుడు రక్షిత్ శెట్టి తో కొంతకాలం ప్రేమలో మునిగి తేలి, ఆ తర్వాత 2018 లో ఎంగేజిమెంట్ దాకా వచ్చి , బ్రేక్ అప్ అయిన విషయం మనకి తెలిసిందే. అప్పట్లో ఈ బ్రేక్ అప్ విషయం కన్నడ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా నిలిచింది.రక్షిత్ శెట్టి తోనే తన తొలి చిత్రం కిరిక్ పార్టీ లో నటించింది. అక్కడ అది బిగ్ హిట్.
రష్మిక కి టాలీవుడ్ బాగానే కలిసి వచ్చింది. ఛలో సినిమా తో తెలుగు లో అరంగేట్రం చేసిన ఈ చిన్నది.. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో గీత గోవిందం,డియర్ కామ్రేడ్ మరియు నాని తో దేవదాస్, మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు , నితిన్ తో బీష్మ , 2021 లో అల్లు అర్జున్ తో పుష్ప , 2022 లో శర్వానంద్ తో ఆడవాళ్లు మీకు జోహార్లు లో నటించింది. ఇలా వరుస సక్సెస్ లతో దూసుకుపోతుంది.
తెలుగు లో తన నెక్స్ట్ మూవీ ‘పుష్ప ది రూల్’ లో నటించనుంది . ఇంకా బాలీవుడ్‌లో సిద్దార్థ్ మల్హోత్రా తో కలిసి మిషన్ మజ్ను, అమితాబ్ బచ్చన్ తో కలిసి గుడ్ బై సినిమా లోనూ నటిస్తోంది. ఇదిలా ఉండగా హీరో విజయ్ దేవరకొండ తో డేటింగ్ చేస్తున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ ‘నేషనల్ క్రష్’ఇంకా ముందు ముందు మరిన్ని విజయ తీరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నాము.
మరిన్ని మంచి ముచ్చట్లు చదవండి :
ప్రభాస్ ఇందుకే పెళ్లి చేసుకోలేదట , 5000 ప్రపోజల్స్‌లో ఒకర్ని ఎంచుకోవడం కష్టమే మరి !
అక్కినేని నాగార్జున ‘ The Ghost ‘ షూటింగ్ దుబాయ్‌లో.. సోనాల్ చౌహాన్ తో తొలి సారి..
Samantha : 12 సంవత్సరాల నా సినీ ప్రయాణం.. ఎమోషనల్ అయిన జెస్సీ