Rashmika: కన్నడ బ్యూటీ రష్మిక ఆచితూచి సినిమాలు చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన విషయం తెలిసిందే. నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డట్టు తెలుస్తుంది.
రష్మిక మందాన చర్యలు కన్నడ పరిశ్రమను ఆగ్రహానికి గురి చేస్తున్నాయనే వాదన వినిపిస్తోండగా, శాండిల్ వుడ్ ఆమెను బ్యాన్ చేసే ఆలోచన చేస్తున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.
ఆ మధ్య డియర్ కామ్రేడ్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న రష్మిక… మిగతా సౌత్ లాంగ్వేజెస్ మాదిరి కన్నడ భాషలో మాట్లాడడానికి ఇబ్బందిపడతాను అని చెప్పింది.. తన మాతృ భాష మాట్లాడటం రాదని చెప్పడం ద్వారా ఆమె కన్నడను అవమానించారని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి.
ఇక ఇటీవల కాంతార చిత్రం చూశారా? ఆ సినిమా సక్సెస్ పై మీ అభిప్రాయం ఏమిటని? అడిగారు. రష్మిక అసలు కాంతారా చిత్రం చూడలేదు అని చెప్పే సరికి ఇది కన్నడిగులు మనోభావాలు దెబ్బ తినడానికి కారణమైంది.
ఇక లేటెస్ట్ ఇంటర్వ్యూ లో ఆమె చేసిన కామెంట్స్ మొత్తం వెరసి ఆమెపై తీవ్ర వ్యతిరేకతకు దారితీశాయి. దీంతో కన్నడ పరిశ్రమ, థియేటర్ ఓనర్స్, ఆర్గనైజేషన్స్ కలిసి ఆమెను బ్యాన్ చేయాలనే ఆలోచన చేస్తున్నట్టు, త్వరలో రష్మికను కన్నడ పరిశ్రమ బహిష్కరించినట్లు అధికారిక ప్రకటన రానుంది అంటున్నారు.
ఇది జరిగితే మాత్రం పుష్ప ది రూల్ తో పాటు పలు చిత్రాలు కోట్ల రూపాయల వసూళ్లు కోల్పోవాల్సి వస్తుంది. రష్మిక రీసెంట్‌గా తమిళ హీరో విజయ్ నించిన వారసుడులో నటించింది.
వారసుడు మూవీ మరో రెండు నెలల్లో విడుదల కానుండగా, ఈ లోగా బ్యాన్ ప్రకటన వస్తే దిల్ రాజుకు లు కనిపించడం ఖాయం. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండగా, రష్మిక హీరోయిన్ గా ఉన్న చిత్రాల నిర్మాతలు వణుకుతున్నారు.
మరో వైపు రష్మిక ఎదుగుదలను చూడలేక కన్నడ పరిశ్రమ ఆమెపై కక్ష సాధిస్తుందని కొందరు అభిమానులు వాపోతున్నారు. రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడం కూడా ఓ కారణమంటూ మండిపడుతున్నారు. మరి దీనిపై రష్మిక ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి.
also read news:
Health benefits of Dry Fruits : ఆరోగ్యాన్నిచ్చే డ్రై ఫ్రూట్స్