HomecinemaRacha Ravi: ర‌చ్చ ర‌వికి రోడ్డు ప్ర‌మాదం.. ఆయ‌న ఆరోగ్యం విష‌మంగా ఉందా..!

Racha Ravi: ర‌చ్చ ర‌వికి రోడ్డు ప్ర‌మాదం.. ఆయ‌న ఆరోగ్యం విష‌మంగా ఉందా..!

Telugu Flash News

Racha Ravi: ఇటీవల సోషల్ మీడియాలో సెల‌బ్రిటీల‌కి సంబంధించి ఎన్ని త‌ప్పుడు వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎవరైనా సెలెబ్రిటీ కొన్ని రోజులు కనిపించకపోతే చనిపోయినట్లు, విషమంగా ఉన్నట్లు నిర్ధారించేస్తూ అభిమానులు ఆందోళ‌న‌కు గుర‌య్యేలా చేస్తున్నారు. తాజాగా రచ్చ రవి విషయంలో కూడా అదే జరిగింది. కమెడియన్ రచ్చ రవి ఆరోగ్య పరిస్థితి విషమం అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. సూర్యాపేట మునగాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది అని.. ఈ ప్రమాదంలో రచ్చ రవికి తీవ్ర గాయాలు అయ్యాయి అంటూ రూమర్లు వ్యాపించాయి.

అయితే తనకు ప్రమాదం జరిగింది అంటూ వస్తున్న వార్తలపై రచ్చ రవి క్లారిటీ ఇచ్చారు. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపాడు. తాను క్షేమంగా ఉన్నానని, తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన వారందరికీ ప్ర‌త్యేక‌ కృతజ్ఞతలు అని రవి పేర్కొన్నాడు. పూణేలో షూటింగ్ ముగించుకుని క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చిన‌ట్టు చెప్పిన ర‌వి త‌నకు ఎలాంటి రోడ్డు ప్రమాదం జరగలేదుని, అందుకు కార‌ణం నేను హైదరాబాద్ కి ఫ్లైట్ లో వచ్చాను అని రవి క్లారిటీ ఇచ్చాడు. ఇక శనివారం జరగబోయే వాల్తేరు వీరయ్య సక్సెస్ ఈవెంట్ కి కూడా హాజరు కాబోతున్నట్లు రవి తెలిపారు. రచ్చ రవి చివరగా అనుపమ పరమేశ్వరన్ బటర్ ఫ్లై చిత్రంలో నటించాడు. ఈ చిత్రంలో రవి నెగిటివ్ షేడ్స్ లో న‌టించి అదరగొట్టాడు.

also read:

Viral Video Today : అక్రమ మద్యం కేసులో రామచిలుక అరెస్టు..

Layoffs : లేఆఫ్స్‌తో అమెరికాలో లక్ష మంది తెలుగు వారి ఇక్కట్లు!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News