పుష్ప-2 (Pushpa 2) పై భారీ అంచనాలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun) , సుకుమార్ (sukumar) కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప-2పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా యొక్క అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బన్నీ ఇంటెన్స్ రోల్
ఈ సినిమాలో బన్నీ చాలా ఇంటెన్స్ రోల్‌లో కనిపించబోతున్నాడు. ఇంటర్వెల్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోనే హైలైట్‌గా ఉంటుందట.
ఊర్వశి రౌటేలాతో ఐటమ్ సాంగ్
పుష్ప-2లో ఐటమ్ సాంగ్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. ఈ పాటను హీరోయిన్ ఊర్వశి రౌటేలా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సమంత సాంగ్ కంటే బెటర్
సమంత చేసిన ఊ అంటా మావ.. ఉఊ అంటావా మావ సాంగ్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఊర్వశి చేసే సాంగ్ సమంత సాంగ్ కంటే కూడా బెటర్‌గా ఉంటుందని టాక్ నడుస్తోంది.
పుష్ప-2 లో కొత్త పాత్రలు
పుష్ప సీక్వెల్‌లో కొన్ని కీలక పాత్రలతో పాటు పలు కొత్త పాత్రలు కూడా పరిచయం కానున్నాయి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం
పుష్ప-2ను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
పుష్ప-2 ఎప్పుడు విడుదల?
పుష్ప-2 సినిమా 2023 డిసెంబర్ 16న విడుదల కానుంది.
also read :
Pushpa 2 : అల్లు అర్జున్ సినిమా లో అర్జున్ దాస్ ?
Pushpa 2 : పుష్ప2 లీక్.. ఈ ట్విస్ట్‌కి ఫ్యాన్స్‌కి పూనకాలే..!