HomecinemaPushpa 2 : పుష్ప‌2 లీక్... ఈ ట్విస్ట్‌కి ఫ్యాన్స్‌కి పూన‌కాలే..!

Pushpa 2 : పుష్ప‌2 లీక్… ఈ ట్విస్ట్‌కి ఫ్యాన్స్‌కి పూన‌కాలే..!

Telugu Flash News

Pushpa 2 : అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన పుష్ప చిత్రం ఎంత సెన్సేష‌న్ సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమా నుండి స్టైలిష్ స్టార్ గా ఉన్న బ‌న్నీ ఐకాన్ స్టార్‌గా మారాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ ని ఈ సినిమాలో చూపించిన విధానంకి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఒక్క‌ ఫ్యాన్స్ మాత్రమే కాదు… ఇతర రాష్ట్రాల్లోను పుష్ప క్రేజ్ పీక్స్‌లోకి వెళ్లింది.

సినిమా తారల నుంచి క్రికెటర్స్ వరకు ఈ సినిమాలో అల్లుర్జున్ మేనరిజమ్స్ ఇమిటేట్ చేస్తూ మూవీకి మ‌రింత ప్ర‌మోష‌న్ చేశారు. 2021లో విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. చిత్రంలో రష్మిక కథానాయికగా నటించ‌గా, సునీల్‌, అన‌సూయ వంటి వారు కూడా ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించి సంద‌డి చేశారు..

ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ గా పుష్ప ది రూల్ తెరకెక్కుతున్న విష‌యం తెలిసిందే. ద‌ర్శ‌కుడు సుకుమార్ శరవేగంగా సెకండ్ పార్ట్ షూటింగ్ చేస్తున్నారు.. 2024లో మేలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.. ప్రస్తుతం ఒడిశాలోని ఓ అటవీ ప్రాంతంలోఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.

ఇదిలా ఉంటే పుష్ప 2 గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దాని ప్రకారం మూవీలోని ఓ కీలక పాత్ర చంపేస్తార‌ట‌. దానికి సంబంధించిన పిక్ కూడా బయటకు రావడంతో దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అయితే రంగస్థలం చిత్రంలో హీరో అన్నని విలన్ ని చంపేసినట్లుగా పుష్పలోకూడా ఓ కీలక పాత్ర శత్రువుల చేతిలో బలికానుందనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది.

అయితే ఆ కీల‌క పాత్ర చనిపోవడం వల్ల సినిమా ఏ కీలక మలుపు తిరుగుతుంద‌నే దానిపై ఇప్పుడు చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. మరి ఇప్పుడు జోరుగా జ‌రుగుతున్న ప్ర‌చారంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ విషయం ఇప్పుడు నెట్టింట‌ హాట్ టాపిక్ గా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ పాన్-ఇండియన్ మూవీలో ఫహద్ ఫాసిల్, సునీల్ ,అనసూయ భరద్వాజ్ ,జగదీష్ వంటి నటులు కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించి మెప్పించ‌నున్నారు..

ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విష‌యం తెలిసిందే. మొద‌టి పార్ట్ క‌న్నా సెకండ్ పార్ట్ మ‌రింత ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంద‌ని అంటున్నారు. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ ఇమేజ్ పాన్ ఇండియా లెవల్ వేరే సినిమాలకు వెళుతుంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే బ‌న్నీ ఓ బాలీవుడ్ మూవీకి సైన్ చేసినట్లు ప్ర‌చారం న‌డుస్తుంది.

-Advertisement-

also read :

BRO: బ్రో టైటిల్ వెన‌క ఇంత అర్ధం ఉందా.. త్రివిక్ర‌మ్ ఆలోచ‌న మాములుగా లేదు..!

pavitra naresh : త్వ‌ర‌లోనే మా పెళ్లి.. మా కోసమే సుప్రీం కోర్టు తీర్పునిచ్చింద‌న్న న‌రేష్‌

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News