Hometelanganaprotocol war : ప్రధాని మోడీ కేసీఆర్ ను, తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు

protocol war : ప్రధాని మోడీ కేసీఆర్ ను, తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు

Telugu Flash News

మునుగోడు ఉపఎన్నిక , ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో రెండు పార్టీల మధ్య వైరం పెరుగుతు వస్తుంది . ఇదే సమయంలో నవంబర్ 12న రామగుండంలోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సిఎల్) ప్లాంట్‌ను జాతికి అంకితం చేసేందుకు ప్రధాని రాష్ట్రానికి రావడం తో రెండు పార్టీల మధ్య ప్రోటోకాల్ వార్ (protocol war) మళ్ళి మొదటికి వచ్చింది.

కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రోటోకాల్‌ను పాటించడం లేదని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఆహ్వానించకుండా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనమని సందేశాన్ని పంపడం ద్వారా తెలంగాణ ప్రజలను అవమానించిందని TRS మంగళవారం ఆరోపించింది.

రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సిఎల్) ప్లాంట్‌లో 11 శాతం వాటా పునరుద్దరకు అవసరమైన ఖర్చులను తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని అయినప్పటికీ కేంద్రం తెలంగాణ ముఖ్యమంత్రికి ఆహ్వానం పంపడం లో విఫలమైనది అని అదేవిధంగా , ప్రధానమంత్రి మరియు కేంద్ర ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య వెనుక ఉన్న జాబితాలో సీఎం పేరు కనిపించడంపై పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ప్లాంటు ప్రారంభమయి దాదాపు 10 లక్షల టన్నుల ఎరువులు ఉత్పత్తి అయ్యాయని, అందులో ఎక్కువ భాగం తెలంగాణలోనే వినియోగిస్తున్నందున, ప్లాంట్‌ను ప్రధాని ప్రారంభించడం లేదా దేశానికి అంకితం చేయడం ఏంటని TRS నాయకులూ మండిపడ్డారు .

సిఎం ఎప్పుడూ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించలేదని, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో, విగ్రహం ప్రారంభోత్సవం వంటి ‘ప్రైవేట్ కార్యక్రమాల’లో పాల్గొనడానికి ప్రధాని వచ్చినప్పుడు మాత్రమే విమానాశ్రయంలో మోడీని స్వీకరించలేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ప్రొటోకాల్ ప్రకారం సీఎం వ్యక్తిగత పర్యటనల్లో ప్రధానిని రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నవంబర్ 2020లో భారత్ బయోటెక్‌ను హైదరాబాద్‌కు వచ్చిన ప్రధానికి స్వాగతం పలికేందుకు వచ్చిన సందర్భం లో కూడా ముఖ్యమంత్రి దూరంగా ఉన్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి .

-Advertisement-

మరోవైపు ప్రధాని తెలంగాణ పర్యటనకు వ్యతిరేకంగా నిరసనగా తెలుపనునట్లు తెలంగాణ విద్యార్థి JAC వెల్లడించింది .

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News