HomecinemaPriyanka Chopra: నా బిడ్డ ద‌క్కుతుంద‌ని అనుకోలేదు.. డాక్టర్స్ దేవుడిలా ప్రాణం పోసార‌న్న ప్రియాంక చోప్రా

Priyanka Chopra: నా బిడ్డ ద‌క్కుతుంద‌ని అనుకోలేదు.. డాక్టర్స్ దేవుడిలా ప్రాణం పోసార‌న్న ప్రియాంక చోప్రా

Telugu Flash News

Priyanka Chopra: గ్లోబ‌ల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. హిందీలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన త‌ర్వాత హాలీవుడ్‌కి వెళ్లి అక్క‌డ తనకంటే చిన్నవాడైన పాప్ సింగర్ నిక్ జోనాస్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2018లోనే పెళ్లి చేసుకున్న ఈ జంట గతేడాది తల్లిదండ్రులుగా ప్రమోషన్ కూడా పొందారు. ప్రస్తుతం హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్రియాంకచోప్రా ఆమె భర్త నిక్ జోనాస్‌కి సరోగసి ద్వారా ఆడపిల్ల పుట్టింది. ఇద్దరూ పాపకు మాల్తీ మేరీ చోప్రా జోనాస్ అని పేరు పెట్టారు. అయితే పాప పుట్టడం, తర్వాత జరిగిన పరిణామాలు తనను, తన భర్త నిక్‌ను ఎలా ప్రభావితం చేశాయో, తన కూతుర్ని తిరిగి బతికించుకోవడంపై కూడా ఆందోళన చెందానని తాజాగా ప్రియాంక చెప్పింది

మాల్తీ మూడు నెలలు ముందుగా జన్మించింది. ఆమె పుట్టినప్పుడు నేను ఆపరేషన్ థియేటర్‌లోనే ఉన్నాను. ఆ సమయంలో బరువు చాలా తక్కువగా, నా చేతి కంటే చిన్నగా ఉండేది. ఆమెను చూసినప్పుడు నేను ఎంతో బాధ‌ప‌డ్డాను. ఆమెకు సంబంధించిన ఎటువంటి గాసిప్స్ చదవడం నాకు ఇష్టం లేదు. అందుకే మీడియాకు దూరంగా చాలా జాగ్రత్తగా పెంచుతున్నాను. నాకు వైద్యపరమైన సమస్యలు ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సరోగసీని ఎంచుకోవాల్సి వచ్చింది. మా సరోగేట్ దయ కలిగినది. దాదాపుగా ఆరు నెలల పాటు మా బుజ్జాయిని జాగ్రత్తగా కాపాడింది’’ అని ప్రియాంక చోప్రా త‌న పరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది.

సరోగసి ద్వారా తమకు బిడ్డను పుట్టించే మహిళ కోసం ఆరు నెలల పాటు శోధించామని ..చాలా మందిని సంప్రదించామని..అందులో ఓ దయగల మహిళ తమకు సంతాన భాగ్యాన్ని కలిగించిందని గర్భం దాల్చడానికి సిద్దంగా ఉన్న మహిళ గురించి ప్రియాంకచోప్రా అద్భుతంగా చెప్పుకొచ్చింది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. ప్రియాంక చోప్రా క్వాంటికో షోతో వరల్డ్ వైడ్‌గా ఫేమ్‌ను సంపాదించుకుంది. చివరగా ‘ది మ్యాట్రిక్స్ రీ సర్కషన్స్’ లో నటించింది ప్రస్తుతం రిచర్డ్ మాడెన్‌తో కలిసి రూస్సో బ్రదర్స్ తెరకెక్కిస్తున్న ‘సిటాడెల్’లో నటిస్తోంది. మరోచిత్రం ‘లవ్ ఎగైన్’లోనూ నటిస్తోంది

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News