Homeandhra pradeshAP Politics : ఏపీలో వచ్చే ఎన్నికల్లో పట్టం ఎవరికి? వైసీపీకి మరో చాన్స్‌ ఇస్తారా? టీడీపీ వైపు మొగ్గు చూపుతారా?

AP Politics : ఏపీలో వచ్చే ఎన్నికల్లో పట్టం ఎవరికి? వైసీపీకి మరో చాన్స్‌ ఇస్తారా? టీడీపీ వైపు మొగ్గు చూపుతారా?

Telugu Flash News

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం (AP Politics) వాడీవేడిగా కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తులు మొదలు పెట్టాయి. ఒకవైపు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఇదేం ఖర్మ రాష్ట్రానికి.. పేరిట ప్రజల్లోకి వెళ్తోంది. టీడీపీ చీఫ్‌ చంద్రబాబు జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. మరోవైపు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కూడా తనదైన మార్క్‌ రాజకీయాలతో ఏపీలో కాక పుట్టిస్తున్నారు. ఇక అధికార పార్టీ మాత్రం తమ సంక్షేమ పథకాలనే నమ్ముకుంది.

ఇలాంటి తరుణంలో వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్‌కు ప్రజలు మరోసారి పట్టం కడతారా? అనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది. ప్రస్తుతానికి జనసేన, బీజేపీ కలిసే ఉన్నా.. బీజేపీని పక్కనపెట్టేసి టీడీపీతో జతకట్టాలని జనసేన చీఫ్‌ ఇప్పటికే సంకేతాలిచ్చారు. మాజీ సీఎం చంద్రబాబుతో భేటీ అయిన పవన్‌.. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని స్పష్టం చేశారు. దీన్ని బట్టి బీజేపీని వదిలేసి వారిద్దరూ ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తోందంటున్నారు.

మరో వారం రోజుల్లోనే టీడీపీ యువనేత నారా లోకేష్‌ యువగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు పూనుకుంటున్నారు. మరోవైపు పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు ప్రభుత్వంపై నిరంతరం దుమ్మెత్తి పోస్తున్నారు. బీజేపీకి ఎలాగూ ఓటు బ్యాంకు తక్కువే కాబట్టి ప్రభుత్వానికి టీడీపీ, జనసేన నుంచే పోటీ ఉండే ఆస్కారం కనిపిస్తోందంటున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్‌ గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలను, ప్రజా ప్రతినిధులను ఇంటింటికీ పంపుతున్నారు. 89 శాతం ప్రజలకు సంక్షేమం అందుతోందని, వారు తమకే ఓటేస్తారని జగన్‌ ధీమాగా ఉన్నారు.

జగన్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత

ఇక క్షేత్రస్థాయిలో విషయానికి వస్తే జగన్‌ ప్రభుత్వంపై కొన్ని అంశాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌, సీపీఎస్‌ రద్దు, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదల, విద్యుత్‌ బిల్లుల భారం పెరిగిపోవడం, అభివృద్ధి విషయంలో అడుగుతున్న ప్రశ్నలకు బదులు లేకపోవడం, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేకపోవడం, అప్పులు పెరిగిపోవడం, కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో చెల్లించలేకపోవడం.. ఇలాంటి అంశాల్లో జగన్‌ను ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ప్రజలు వచ్చే ఎన్నికల్లో టీడీపీవైపు మొగ్గు చూపుతారా? లేదా జగన్‌ సంక్షేమ పథకాలపై ప్రాధాన్యత ఇస్తారా? అనేది వేచి చూడాల్సిందే.

also read: 

Deepika Ranveer at Anant Ambani Radhika Merchant Engagement Ceremony

-Advertisement-

Divi Vadthya black dress latest hot stills, actress divi pics

Viral Video today : వెరైటీ ఎంగేజ్‌మెంట్‌.. రింగులో సస్పెన్స్‌.. చివరకు ఏమైందో మీరే చూడండి!

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News