Bala krishna: క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న పోసాని కృష్ణ మురళి రాజకీయాలలోకి వెళ్లిన తర్వాత పలువురు స్టార్ హీరోలపై సంచలన ఆరోపణలు చేస్తూ వార్తలలో నిలుస్తున్నాడు. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన ఓ సినిమా కార్యక్రమానికి సంబంధించిన మీడియా మీట్ లో మాట్లాడిన పోసాని కృష్ణమురళీ బాలయ్యపై నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని బాలకృష్ణ సైకో అని పిలవటంపై ఆయన ఘాటుగా స్పందించారు.
Bala Krishna: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికావంటూ నవదీప్ పరువు తీసిన బాలయ్య
బాలకృష్ణ ఇద్దరినీ తుపాకీతో టపీమని కాల్చేశాడు. మంచివాళ్లెవరైనా అలా కాలుస్తారా.. చె ప్పండి? కాల్చినాక కూడా ఆయన జైలుకు కూడా వెళ్లలేదు. అదే నేను చేస్తే అలానే వదిలేస్తారా… గన్ ఉంది కదాని ఇద్దరిని దారుణంగా కాల్చాడు. ఇప్పుడు చెప్పండి ఎవరు సైకో.. ఎవరు మానసిక వ్యాధితో బాధపడుతున్నారు.. అంటూ పోసాని సంచలన కామెంట్స్ చేసారు. అంతటితో ఆగకుండా కళ్ల ముందే నైట్ వాచ్మెన్ చనిపోగా, ఆ శవం అక్కడ ఉండగానే.. మేకప్ వేసుకుని షూటింగ్ కు వెళ్లిపోయారు..సైకోలే కదా ఇలాంటి పనులు చేసేది అంటూ పోసాని దారుణమైన కామెంట్స్ చేశారు.