Petronas Towers : మలేషియా రాజధాని కౌలాలంపూర్లో నిర్మించబడ్డ 1483 అడుగుల ఎత్తైన పెట్రోనాస్ జంట టవర్లు క్రీస్తుశకం 1998వ సంవత్సరం నుంచి 2004వ సంవత్సరం వరకు ప్రపం చంలోనే ఎంతో ఎత్తైన ఆకాశ హార్యాలుగా పేరుపొందాయి. పెట్రోలియం కంపెనీలన్నిటిని ఒకటిగా చేస్తూ మలేషియాలో జాతీయం చేయబడ్డ పెట్రోలియం రంగానికి ఈ జంటటవర్లు ముఖ్య కార్యాలయం చేయబడ్డాయి. అప్పటి గాఢ వాంఛగల మలేషియా ప్రధానమంత్రి మహథి యార్ మొహమ్మద్ కన్న కలలకు అనురూపంగా ఈ ఆకాశ హర రూపకల్పన చేయబడ్డది.
ఆధునిక మలేషియా దేశానికి ఒక చిహ్నంగా, సాంప్రదాయ ఇస్లామిక్ మత వాతావరణం కలిగిన ఆ దేశంలోని, ఇస్లాం మతంచేత ప్రభావితమైన వారి నిర్మాణ శైలిని, గొప్ప సాంకేతికతఇంజనీరింగ్తో మేళవింపు చేస్తూ దీని నిర్మాణానికి రంగం సిద్ధంచేయబడ్డది. ఇస్లాం మతంలో క్రమ విధానానికి సామరస్యానికి ప్రతీక అయిన సూక్ష్మ అగ్రాన్ని దృష్టిలో పెట్టుకొని సీజర్ పీలీ అనే నిర్మాణశిల్పి దీనికి రూపకల్పన చేశాడు. సూక్ష్మనక్షత్రాన్ని విస్తరిస్తూ దాని కోణాల్లో స్వస్తిక ఆకారంగల ఖాళీలను ఏర్పాటు చేస్తే ఆ రకంగా ఉపయో గించటానికి వీలైనన్ని స్థలాలు చాలా పెంచుకుంటూ వచ్చాడు.
నిర్మాణాత్మకంగా సంలీనం చేస్తూ ఎంతో సామర్థ్యంతో తయారయిన ఈ ఆకాశహర్మ్యాల ప్లాను, దీని ఇంజనీరు చార్లీ థొరంకటనేకు ప్రత్యేకమైన స్థిరత్వం కలిగిన రెండు ఆకాశహర్మాల్నినిర్మించటానికి చక్కటి అవకాశం కలిగించింది. నిర్మాణ శిల్పి పీలీ తయారు చేసిన భూ పధకం దొరంటన్క రూప నిర్మాణ ఇంజనీరింగులో వున్న అపూర్వ ప్రతిభతోడ పెట్రోనాస్ జంట టవర్లు ప్రపంచంలోనే ఎంతో ఎత్తైన ఆకాశ హర్మాలుగా మలచబడ్డాయి.
ఈ జంట టవర్ల నిర్మాణం ప్రారంభిద్దామని అనుకున్నదశలోనే ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. క్రీస్తుశకం 1992వ సంవత్సరంలో వీటి నిర్మాణానికి పునాదిరాయి వేయ బోయేముందు ఎన్నుకొన్న ఈ ఆకాశ హర్మ్యాల నిర్మాణానికి అనువుగా లేదని తెలిసింది. ఈటవర్ల బరువును అక్కడి నేలలోని ఆధారశిల మోయగలిగేంత దృఢంగా లేదని ఋజువు కావటంతో నిర్మాణ కార్యక్రమం పూర్తిగా నిలిచిపోయింది. ఈ స్థలానికి 200 అడుగుల దూరంలో నేలకింద నున్న ఆధారశిల బాగా లోతుగా వుండి, బలంగా ఉందని తేలటంతో ధారంటన్ ఈ ఆకాశ హర్మ్యాల నిర్మాణాన్ని అక్కడికి మార్చాడు.
భూమికి ఎంతో ‘లోతులోవున్న ఆధారశిలలోని 400 అడుగుల ఎత్తైన నిటారు స్తంభాలను ఏర్పాటు చేసివాటి మీద నిర్మించే భారీ కాంక్రీటు పునాది మీద ఈ జంట టవర్లకు ఆధారాన్ని స్థిరత్వాన్ని చేకూర్చ టానికి నిర్ణయం చేయబడ్డది. ఈనాటికి కూడా ప్రపంచంలో ఇవే లోతైన కాంట్రీటు పునాదులుగా నిలిచివున్నాయి. 52 గంటల పాటు రెండు నిమిషాల కొక కాంక్రీటు మిక్సింగ్ ట్రక్ ‘ చొప్పున ఎంతో ప్రత్యేకంగా తయారుచేసిన అత్యున్నత శక్తివంత మైన కాంక్రీటును పునాది గొయ్యిలోకి కుమ్మరించాయి.
ఈ టవర్ల నిర్మాణంలో ప్రాథమికమైన రూప నిర్మాణ పదార్ధం పునర్బలన కాంక్రీటు కాబట్టి, ఉక్కు చట్రంతో నిర్మించే ఆకాశహర్యాల కంటె ఇవి రెట్టింపు బరువు ఉన్నాయి. ప్రతి టవరుకు నిర్మించిన పునాది దాదాపు 3 లక్షల టన్నుల బరువును మోస్తుంది.ఈ టవర్ల నిర్మాణం 6 సంవత్సరాల కాలంలో పూర్తికా వాలని ముందే ఒప్పందం చేసుకోబడ్డది. 6 సంవత్సరాల కాల వ్యవధిలో దీని నిర్మాణం పూర్తికాకపోతే, అక్కడ్నించి ప్రతిరోజుకి 7,00,000 యు.ఎస్. డాలర్లు పెనాల్టీగా మలేషియ ప్రభుత్వానికి చెల్లించ టానికి ఈటవర్ల నిర్మాణ బాధ్యత తీసుకొన్నాక కంపెనీ ఒప్పు కొన్నది.
రోజుకి 2,000 మంది నిర్మాణ కార్మికులు వారా నికి ఏడురోజుల పాటు, అలా నిర్మాణ కాలం అంతా ఎంతో ఒత్తిడికి లోనవుతూ పనిచేశారు. నిర్ణయించిన చివరి గడువుకు కొద్దిగా ముందే దీని నిర్మాణం పూర్తి చేయాలంటే 88 అంతస్తు లను నాలుగురోజుల కొక అంతస్తు నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా అంత ఒత్తిడిని తట్టుకుంటూ నిర్మాణం వేగంగానే కాకుండా సక్రమంగా కూడా కొనసాగుతూ, నిర్మాణ పరిశ్రమలో ఎన్నో ప్రపంచ రికార్డుల్ని నెలకొల్పుతూ చివరి గడువు కొద్దిగా ముందే దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు.
ఉదాహరణకి ఒక పనివారిదళం ప్రత్యేకంగా తయారు చేసిన పరికరాలను ఉపయోగిస్తూ, నేలనుంచి 1100 అడుగుల ఎత్తుకు కాంక్రీటును నిరంతరాయంగా సరఫరా చేస్తూ వచ్చింది. సాంప్రదాయకమైన సర్వేక్షణ పరిజ్ఞానాన్ని ఉపయోగించకుండా GPS పరిజ్ఞానాన్ని భూ స్థితి విధానాన్నిఉపయోగిస్తూ ప్రపంచంలో మొదటిసారిగానిర్మించబడ్డ భవన నిర్మాణ పథకంగా దీన్ని ఒకటిగా చెప్పవచ్చు.
భూమికి 560 అడుగుల ఎత్తులో ఈ రెండు గాజు కాంక్రీటు టవర్లను 41, 42 అంతస్తుల దగ్గర కలుపుతూ 400 టన్నుల బరువున్న వంతెన కూడా నిర్మించబడ్డది. మొదట్లో ఈ ఆకాశ వంతెన అలంకరణ వివరంగా, స్థిరత్వానికి, రవాణాకు అనుకూలంగా నిర్మించబడింది. క్రీస్తుశకం 2001వ సంవత్సరం సెప్టెంబరు 9న న్యూయార్క్ ని ప్రపంచ వ్యాపార కేంద్రం భవనం మీద జరిగిన దాడిని దృష్టిలో ఉంచుకుని కూడా థొరన్ టాన్ దీని రూపకల్పన చేశాడు.
క్రీస్తుశకం 1977వ సంవత్సరంలో అనుకున్న సమయా నికే పెట్రానాస్ జంట శిఖరాలు ప్రారంభించబడ్డాయి. 7 సంవ త్సరాల పాటు ఇవి ప్రపంచంలోనే చాలా ఎత్తైన ఆకాశ హర్మ్యాలుగా నిలిచాయి.
also read :
Bathinda : బఠిండా సైనిక స్థావరం లో మరో జవాను మృతి.. ఏం జరుగుతుంది ?
Akira Nandan: సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ తనయుడు.. అప్‌డేట్ వచ్చేసింది..!
moral stories in telugu : కలలోని పాములు రాజుకి ఏం చెప్పాయి?