పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించనున్నారు.
ఈ సినిమా కి “భవదీయుడు భగత్ సింగ్” అనే టైటిల్ ను అనుకున్నారు. కానీ రీసెంట్ గా ఈ సినిమా కి మరొక టైటిల్ ను ప్రకటించిన చిత్ర టీమ్ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. “పవన్ కళ్యాణ్ ఇన్ అండ్ యాజ్ ఉస్తాద్ భగత్ సింగ్.
ఈ సారి ఎంటర్టైన్మెంట్ అంతకు మించి ఉంటుంది. షూటింగ్ అతి త్వరలోనే మొదలు అవుతుంది,” అంటూ సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వారు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.. తాజాగా ఈ చిత్రం సంక్రాంతి 2024 విడుదల అవుతుందని హింట్ ఇచ్చారు హరీష్ శంకర్.
తాను డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘తేరీ’ (తమిళ్) రీమేకా, కాదా? అనే విషయాన్ని చెప్పాలనుకున్నానని, పలువురు గీత దాటడంతో ఆగిపోయానని వివరించారు. అభిమానులు తన సోదరుల్లాంటి వారన్న హరీశ్.. ఇతర దర్శకుల్లాకాకుండా ప్రతి విషయాన్ని పంచుకోవాలనుకున్నానని చెప్పారు.
‘ఉస్తాద్ భగత్‌సింగ్’.. ‘తేరీ’ రీమేకో కాదో తెలియాలంటే తెరపై సినిమా చూడాల్సిందేనన్నారు. అనుకున్న విధంగా షూటింగ్ సాగితే 2024 సంక్రాంతికి సినిమా విడుదలయ్యే అవకాశం ఉందన్నారు.
also read news:
Horoscope Today : 30-01-2023 సోమవారం ఈ రోజు రాశి ఫలాలు
Hair Fall : జుట్టు రాలడం ఆగిపోవాలంటే ఈ చిట్కాలు పాటించండి!