HomecinemaPavitra Lokesh: మా జంట‌కి కృష్ణ‌, విజ‌య నిర్మ‌ల ఆశీస్సులు త‌ప్ప‌క ఉంటాయ‌న్న ప‌విత్రా లోకేష్‌

Pavitra Lokesh: మా జంట‌కి కృష్ణ‌, విజ‌య నిర్మ‌ల ఆశీస్సులు త‌ప్ప‌క ఉంటాయ‌న్న ప‌విత్రా లోకేష్‌

Telugu Flash News

Pavitra Lokesh: ఇటీవ‌లి కాలంలో నరేష్‌, పవిత్రా లోకేష్ మీడియాలో ఎంత హాట్ టాపిక్‌గా మారారో చూశాం. అయితే వీరిద్ద‌రు క‌లిసి ఇప్పుడు మ‌ళ్లీ పెళ్లి అనే టైటిల్‌తో సినిమా చేస్తున్నారు. ఇప్ప‌టికే ట్రైల‌ర్ విడుద‌ల కాగా, ఇది ఆక‌ట్టుకుంది. ఇందులో నరేష్-పవిత్ర బంధంతో పాటు సూపర్ స్టార్ కృష్ణ ఇంటి వ్యవహారాలను కూడా చూపించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అయితే ప‌విత్రా లోకేష్ తాజాగా మాట్లాడుతూ.. విజయకృష్ణ మూవీస్​ను రీలాంఛ్ చేయడం శుభపరిణామమని చెప్పుకొచ్చింది.

అలానే తమ జంటకు కృష్ణ, విజయనిర్మల ఆశీస్సులు ఉంటాయని పేర్కొంది. ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మ‌రాయి. కొద్ది రోజులుగా స‌హ‌జీవ‌నం సాగిస్తున్న ఈ జంట మ‌ధ్య‌మ‌ధ్య‌లో వెరైటీగా వార్త‌ల‌లోకి ఎక్కుతూ ఉన్నారు. అనేక వివాదాలు న‌డుస్తున్నా కూడా న‌రేష్‌, ప‌విత్ర ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ‘మళ్లీ పెళ్లి’ సినిమా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని, దర్శకుడు ఎంఎస్​ రాజుతో కలసి పనిచేయడం వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చని చెప్పుకొచ్చింది ప‌విత్రా. ‘మళ్లీ పెళ్లి’ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారంటూ ప‌విత్రా లోకేష్ ధీమా వ్య‌క్తం చేసింది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News