HomelifestylePattu cheera - our tradition : పట్టుచీర- మన సాంప్రదాయం గురించి తెలుసుకోండి

Pattu cheera – our tradition : పట్టుచీర- మన సాంప్రదాయం గురించి తెలుసుకోండి

Telugu Flash News

Pattu cheera – our tradition : పట్టుచీర- మన సాంప్రదాయం
భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించటమే పట్టుచీర కట్టుకోవడమంటే. నిండుగా చీర కప్పుకుని, నుదుట కుంకుమ దిద్దుకోవటం వలన ప్రపంచ వ్యాప్తంగా భారతస్త్రీలకు మెండై మన్నన.

ఏ పెళ్ళికయినా వెళ్ళినప్పుడు చూడండి. ఎందరు ఎన్ని చీరలు కట్టుకున్నా మొదటిస్థానం పట్టుచీరదే. ఆ తరువాతే మిగిలినవన్నీ ! ఆప్యాయతలను దూరం చేసుకుంటున్నట్లే ఈనాడు ఈ పట్టుచీరలకు కూడా దూరమవుతున్నారు జనం. ఇది ఏ మాత్రం హర్షించదగ్గది కాదు. తరతరాలుగా వస్తున్న మన ఆచారాలకు, సాంప్రదాయాలకు తప్పక విలువ ఇవ్వాలి. వీటిని కాపాడుకోటానికి అహర్నిశలు శ్రమించాలి. అది మన ధర్మం.

మరి ఈ పట్టుచీరలను కాపాడుకోవటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం !

  • పట్టుచీర కొన్నాక సంవత్సరం లోపు డ్రైవాష్ చేయించాలి. వన్నె తగ్గుతుందని కొంత మంది అభిప్రాయం. అలా చేయకపోతే అసలు చీరకే మోసం. ఇంకో విషయం పట్టుచీర కొనగానే మూడు రోజుల లోపు బాక్స్ లోంచి తీసెయ్యాలి.
  • ఈ మధ్య డిజైను చీరలు, తళుకులు, ఎంబ్రాయిడరీ శారీస్ ఎక్కువగా వాడుతూ ఉండటంతో కనీసం పెళ్ళిళ్ళకు కూడా పట్టుచీరలు తీయటం లేదు. అలా కదపక మడత మీదే ఉంచితే మడత ఉన్నచోటల్లా పెగిలిపోవటం ఖాయం.
  • ఎన్నివేల పట్టుచీరలయినా పనికిరాకపోవటం సహజంగా జరిగిపోతుంది. ఆపైన బాధపడినా లాభం ఉండదు. ఇలా పెగిలి పోకుండా ఉండాలంటే 3 నెలలకొకసారి మడతలు మార్చి జాగ్రత్త పెట్టుకోవాలి.
  • పట్టుచీర ఒక్కసారి వాడాక దానిని నీడలో కాసేపు ఆరనివ్వాలి. ఆ తరువాతే మడతపెట్టి బీరువాలో పెట్టుకోవాలి లేదా ఇస్త్రీకయినా ఇవ్వాలి.
  • కలరా ఉండలు కాగితంలో పొట్లం కట్టి కానీ, నెట్బ్యాగ్ కానీ వీటి మధ్య ఉంచాలి. ఇలాచేస్తే మంచి సువాసన భరితంగా ఉంటాయి. సిల్వర్ ఫిష్ బారినపడకుండా కూడా కాపాడుతాయి.
  • పట్టుచీరలను ఐరన్ సేఫ్ అలా ఉంచితే పాడయిపోయే అవకాశముంటుంది. ఒకపేపరు చుట్టి భద్రం చేసుకోవాలి. లేదా కాటన్ వస్త్రంలో మడిచి భద్రపరుచుకోవాలి.
  • పట్టుచీరలను హాంగర్క వ్రేలాడదీయకూడదు.
  • పట్టుచీరను మొదటి మూడు ఉతుకులు మంచినీళ్ళతోనే వాష్ చేయాలి. బార్డర్, పల్లూ, బాడీ విడివిడిగా ఉతకాలి. పట్టుచీరను బాధ కూడదు, వీటిని పిండకూడదు. వీటిని ఎక్కువసేపు నాననివ్వకూడదు.

also read :

Weather Today : తెలుగు రాష్ట్రాల్లో నేడు వర్షాలు కురిసే ప్రాంతాలివే.. ఈ రోజు వాతావరణం.. (26-04-2023)

Gopichand: గోపిచంద్‌తో గొడ‌వ‌కు దిగిన తేజ‌.. నువ్వు ఏం పీకావ్ అంటూ ఫైర్

-Advertisement-

Horoscope (26-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Ram Charan: రామ్ చ‌ర‌ణ్‌కి పుట్ట‌బోయేది అమ్మాయేన‌ట‌.. విష‌యం ఎలా బ‌య‌ట‌ప‌డిందంటే..!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News