HomecinemaProject K : 'ప్రాజెక్టు కె'లో విలన్ గా కమల్ హాసన్ ?

Project K : ‘ప్రాజెక్టు కె’లో విలన్ గా కమల్ హాసన్ ?

Telugu Flash News

ప్రభాస్ (prabhas), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) , దీపికా పదుకొణె (deepika padukone) తదితర గొప్ప నటులతో రూపొందుతున్న ‘ప్రాజెక్ట్ కె’ (Project K) కోసం ప్రముఖ నటుడు కమల్ హాసన్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కి విలన్ గా కమల్ హాసన్ (kamal hassan) ని పెట్టాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. కమల్ హాసన్‌కి నిర్మాత అశ్వినీదత్ రూ.150 కోట్లు ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే కమల్ హాసన్ ను సంప్రదించారని, అయితే రూ.150 కోట్ల పారితోషికం అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చిత్ర వర్గాలు తెలిపాయి.

కమల్ హాసన్ తో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయని, కమల్ ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదని తెలుస్తోంది. ఈ విషయంపై కమల్ నిర్ణయం తీసుకోవడానికి రెండు వారాలు పట్టే అవకాశం ఉందని ప్రాజెక్ట్ కె సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు 70 శాతం నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. అమితాబ్, దీపికా పదుకొనేల షూటింగ్ 10 రోజుల్లో పూర్తవుతుందని సమాచారం.

read more news :

Project K: హాలీవుడ్ మూవీ ఆధారంగా ప్రాజెక్ట్ కె తెర‌కెక్కుతుందా..అంద‌రిలో ఆస‌క్తి

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News