Nutrition tips : ఆయు ర్వృద్ధి, బలము, దేహ పుష్టి, ఆరోగ్య పరిపుష్టి, వీర్యవృద్ధి, స్త్రీలకు సంతాన ప్రాప్తి కోసం ఏయే ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
- ఆవునెయ్యిని ప్రతిరోజు అన్నములో తీసుకొనినచో ఆయుర్వృద్ధి, బలము, పుష్టి కలుగును.
- పెన్నేరుగడ్డలు పాలతోగాని నేతితోగాని నీటితోగాని 15 రోజులు తీసుకొనినచో కృశించిన దేహము తగ్గి, పుష్టి కలుగును,
- నీరుల్లిపాయ ముక్కలు 2 తులములు, 2 తులముల నేతిలో వేసి ఉడికించి, 2 తులముల పటికబెల్లం పొడిని కలిపి ప్రాతః కాలమునందు తినినచో శరీరము నందలి దుష్టవేడి నశిం చును, బలము కలుగును.
- తుమ్మచెట్టు పట్ట చూర్ణమును పూటకు అరతులము చొప్పున 2 తులముల తేనెతో కలిపి తీసుకొనినచో దేహము గట్టిపడును.
- సునాముఖి ఆకు చూర్ణము పావుతులము, కొంచెము తేనెతో కలిపి ప్రతిరోజు తీసు కొనినచో తొమ్మిదినెలలో అధికమైన బలము కలుగును..
- బలము కొరకు ఖరీదైన మందులు కొనలేని గర్భిణీ స్త్రీలు, సన్నగా బలహీనముగా ఉన్న తమ పిల్లలు ఆరోగ్యవంతముగా ఉండవలెనన్నచో మొలకలెత్తిన పప్పుధాన్యపు గింజలను తినవలెను. దీనివలన సంతానములేని స్త్రీలు పిల్లలను పొందే అవకాశము కూడా కలదు.
- తలకు నువ్వులనూనె మర్ధన చేసికొని, వార మునకు ఒకటి లేదా రెండుసార్లు తలకు పోసుకొనినచో వృద్ధాప్యము త్వరగా రాదు.
- ఆవుపాలలో 1 స్పూను ఆవునెయ్యి కలిపి ఉదయము, సాయంత్రము 45 రోజులపాటు తీసుకొనినచో శరీరములోని వేడితగ్గి, పుష్టిగా తయారగుదురు. వృద్ధాప్యపు లక్షణాలు కూడా దగ్గరకు రావు.
- ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, అల్లము వీటిని సమముగా రసము తీసి ప్రతిరోజు త్రాగిన ఆరోగ్యముగా ఉందురు.
- వంటలలో వెల్లుల్లి ఎంత అధికముగా వాడిన అంత ఆరోగ్యము.
- ఆవునెయ్యిని ఉదయము, సాయంత్రము పాలతో చెంచాడు చొప్పున మండలము (45 రోజులు) త్రాగినచో ఆరోగ్యము నకు మంచిది. శరీరములో వేడి తగ్గుటతోబాటు పుష్టిగా తయారు కాగలరు. వృద్ధాప్య లక్షణాలుకూడా దరిచేరవు.
- బెల్లము, నువ్వుపప్పు కలిపి తినినచో పురుషులకు వీర్యవృద్ధి కలుగును. స్త్రీలకు సంతాన ప్రాప్తి కలుగును.
- ప్రతిరోజు రాత్రిపూట ఖర్జూరపు పండ్లను నీటిలో నానబెట్టి ఉదయము పండ్లను బాగా పిసికి ఆ నీటిని 40 రోజులు త్రాగి నచో దేహములో కలిగిడి తేడాను మీరే గమనించగలరు.
- సూర్యోదయ కాలమునందు 5 దోసిళ్ళనీరు త్రాగినచో రోగము, ముసలితనము లేక వంద సంవత్సరములు జీవించెదరు.
- మలమూత్ర విసర్జనకు ముందుగా నీరు త్రాగినచో వాత, పిత్త, కఫ, గ్రహణి దోషములు హరించి వంద సంవత్సర ములు జీవించెదరు.
- తేనె, బెల్లము, నూనె కలిపి ప్రాతఃకాలమునందు తీసుకొని నచో సమస్త రోగములు హరించును.
- అశ్వగంధ (పన్నేరు) చూర్ణములో బెల్లముకాని, పాలు నువ్వులు గాని, నెయ్యిగాని సమభాగములుగా కలుపుకొని తినినచో అన్ని రోగములు నశించును.
Vitamin Poisoning : అధిక మొత్తంలో విటమిన్లు తీసుకుంటే కలిగే నష్టాలు ?
remedies for piles : పైల్స్ సమస్యకు అద్భుతమైన పరిష్కారం.. ఈ ఆయుర్వేద వైద్య చిట్కాలను పాటించండి..
-Advertisement-