HomecinemaNTR : ఆ ఒక్క సీన్ చూసి ఎన్టీఆర్‌కి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన హాలీవుడ్ డైరెక్ట‌ర్

NTR : ఆ ఒక్క సీన్ చూసి ఎన్టీఆర్‌కి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన హాలీవుడ్ డైరెక్ట‌ర్

Telugu Flash News

NTR: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తాత‌కి త‌గ్గ మ‌న‌వ‌డిగా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకుంటున్నాడు. ఇటీవ‌ల ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబ‌ల్ స్టార్‌గా కూడా మారాడు జూనియ‌ర్. ప్ర‌స్తుతం కొర‌టాల శివ‌తో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తుండ‌గా, ఈ సినిమాతో ఆయన రేంజ్ మ‌రింత పెరుగుతుంద‌ని అంటున్నారు.

అయితే ఓ హాలీవుడ్ డైరెక్టర్ ప్ర‌స్తుతం ఎన్టీఆర్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారట‌. ఈ విష‌యం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ గన్.. తారక్ తో కలిసి పనిచేయాలనుందని తెలియ‌జేశాడు.

‘గార్డియన్ ఆఫ్ ది గ్యాలక్సీ 3’ ప్రమోషన్ లో భాగంగా ప్రముఖ ఛానెల్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయ‌న ఈ సిరీస్ లో ఇండియన్ యాక్టర్ ని పరిచయం చేయాలనకుంటే ఎవరినీ ఎంపిక చేసుకుంటారు అని జేమ్స్‌ని అడిగారు యాంక‌ర్. దానికి ఆయ‌న జూనియ‌ర్ ఎన్టీఆర్ పేరు చెప్పారు.

ఆర్ఆర్ఆర్ మూవీలోని ఓ సీన్ లో బోనులో నుంచి పులులతో బయటకొచ్చే వ్యక్తితో ప‌ని చేయాల‌ని అనుకుంటున్నాను. ఏదో ఒకరోజు కచ్చితంగా అత‌నితో పనిచేస్తాను. అమేజింగ్-కూల్ అంటూ జేమ్స్ వ్యాఖ్యానించారు.

మరిన్ని  సినిమా వార్తల కోసం 

 

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News