Monday, May 13, 2024
HomelifestyleNew Year Resolutions 2023 : ఆనందం కలిగించే రిజల్యూషన్స్..ఈ మూడు సులభమైన సూచనలను పాటించండి

New Year Resolutions 2023 : ఆనందం కలిగించే రిజల్యూషన్స్..ఈ మూడు సులభమైన సూచనలను పాటించండి

Telugu Flash News

ఈ రోజు ఈ ఏడాది 2022 కి చివరి రోజు. రేపటి తో కొత్త ఏడాది 2023 మొదలు కాబోతుంది. మనలో చాలా మంది రాబోయే కొత్త ఏడాది కోసం,మనం తీసుకోబోయే కొత్త రిజల్యూషన్స్(New Year Resolutions 2023) కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటాం.అయితే మనం తీసుకునే రిజల్యూషన్స్ లో ఏడాదికీ ఏడాదికీ కొంచెం తేడా ఉన్నపటికీ అందరూ కోరుకునేది, ఎదురు చూసేది సంతోషం కోసమే.

మనం న్యూ ఇయర్ రోజున తీసుకునే చాలా వరకు రిజల్యూషన్స్ అవి తీసుకున్న కొన్ని రోజులకో, వారానికో నీరు పడిన మంట లాగా ఆరిపోతున్నాయి. అంటే మనం అనుకున్న విధంగా,అనుకున్న విషయాలను మనం గట్టిగా సాధించలేకపోతున్నాం.దీని గురించి తీవ్రంగా ఆలోచించి,మనం తీసుకున్న రిజల్యూషన్స్ నిజమయ్యేలా చేసి మనం అనుకున్న పలితాలు పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అలా మనకి ఆనందం కలిగించే రిజల్యూషన్స్ ని నిజంగా పలించేలా చేయడానికి ఈ మూడు సులభమైన సూచనలను పాటించండి,మీరు కోరుకున్న వాటిని సాధించండి.

1.చిన్నగా మొదలు పెట్టండి:

ప్రవర్తనా శాస్త్రం ప్రకారం మన ప్రవర్తనలో ఒక చిన్న మార్పు తీసుకు రాగలిగితే అది దాదాపు నాలుగు శాతం మనం చేయాలనుకున్న పనిని చేయడంలో సహాయపడుతుందట. మనలో చాలా మంది పెద్ద మార్పుతో ప్రారంభించినప్పటికీ వాళ్ళు కొన్ని రోజులకో లేదా వారానికో వారి పనిని అశ్రద్ద చేసి వదిలేస్తుంటారు. ఏదైనా చిన్నదిగా ప్రారంభించి, దానిని చాలా కాలం పాటు అలా చేస్తూ మన పనిని మనం నిర్వర్తిస్తే, ఆ చిన్న మార్పులే అంతిమంగా పెద్ద మార్పుకు దారి తీస్తాయి.

మీరు మీ భవిష్యత్ కోసం చేస్తున్న పనులు సరిగ్గా చేస్తున్నారో…లేదో… తెలియాలి అంటే వారానికి ఒకసారి, నెలకొక సారి మీరు చేస్తున్న పనిలో పురోగతి చెందారా….లేదా…. సమీక్షించుకోండి, ప్రతి క్షణం ప్రతి దాని నుంచి నేర్చుకోండి, మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటూ ఉండండి,మీరు చేస్తున్న పనిని కొనసాగించండి.

మనలో ప్రతి ఒక్కరూ భిన్నంగా ఉంటారు, కాబట్టి మనమందరం మీకు సరైన సమీక్ష సమయం ఏమిటో తెలుసుకోండి. కొంత మంది ప్రతి రోజూ వారి పురోగతిని చూసుకుంటారు,కొంత మంది వారానికి చూసుకుంటారు,ఇంకొంత మంది నెలకి చూస్తుంటారు. దీని బట్టి మీరు ఎలాంటి వాళ్లో చూసుకోండి.

-Advertisement-

కొన్ని సార్లు మన కొత్త మార్పును కోల్పోవచ్చు లేదా మన పురోగతిని సమీక్షించలేక పోతుండొచ్చు లేదా మన పురోగతి కొంచెం నెమ్మదిగా ఉంటుండొచ్చు లేదా అసలు మన పురోగతిలో అభివృద్ధి ఉండకపోవచ్చు.

ఇలాంటి సమయాల్లో మనం మన పట్ల దయతో ఉండాలి, కానీ మనం చేసే పనిని వదలకూడదు. మనం తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్లో వచ్చే పలితాల గురించి, దాని వల్ల వచ్చే ఆనందం గురించి ఆలోచిస్తూ,ఆత్మ విశ్వాసం నింపుకుంటూ ముందుకు సాగిపోవాలి.

2.రోజూ ఆనందాన్ని పొందండి:

ఆనందాన్ని మన రోజువారీ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. మనకి ఆనందాన్ని కలిగించేది ఏదో తెలుసుకుని దాన్ని మన రోజువారీ జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలి. మనలో చాలా మంది ఎక్కువ ఆనందం కలిగించే విషయం జరగగానే చేసే పని వాయిదా వేస్తూ ఉంటారు.

కానీ మనం సాధించాలనుకున్న విషయం వైపు మన అడుగులు పడాలి అంటే మనం చేసే పని అది చిన్నది అయినా సరే ప్రతి రోజూ ఆనందాన్ని కలిగించేది అయ్యుండాలి. పైన చెప్పినట్టుగా అది మన ప్రవర్తనలో చిన్న మార్పే అయినా పర్వాలేదు.

3.అనుబంధాలలో పెట్టుబడి పెట్టండి:

మన కుటుంబ సభ్యులలో ప్రేమలూ,అనుబంధాలే మనకి ఎక్కువగా ఆనందాన్ని కలిగిస్తాయని దాదాపు 70 ఏళ్ల పాటు చేసిన ఒక పరిశోధన ప్రకారం తేలింది. మన రోజు వారీ తీరిక లేని జీవితం వల్ల మన కుటుంబ సభ్యులను మనం అసలు పట్టించుకోము. అలా కాకుండా మనం అనుకున్నది చేయాలి అంటే, ఆనంధాన్ని పొందాలి అంటే మనకి ఉన్న సమయాన్ని, శక్తిని మన కుటుంబ సభ్యులకు మరింత దగ్గర కావడంలోనూ, ప్రేమను,అనుబంధాన్ని పంచడంలోనూ ఉపయోగించాలట.

ఈ మూడు సులువైన సూచనలను తప్పక పాటిస్తే ఇవి మన ఎదుగుదలలోనూ,మనం తీసుకున్న న్యూ ఇయర్ రిజల్యూషన్స్ లను నిజం చేసుకుని ఆనంధాన్ని పొందడంలో సాయపడతాయి.  మీరు కూడా పాటిస్తే మీకు కూడా ఉపయోగ పడతాయి.

మరిన్ని వార్తలు చదవండి :

తెలంగాణ వార్తలు  |  జాతీయ వార్తలు  |  సినిమా వార్తలు  |  అంతర్జాతీయ వార్తలు  |  ఆరోగ్య చిట్కాలు

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News