Homeandhra pradeshAndhra Pradesh News : ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh News : ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు

Telugu Flash News

Andhra Pradesh News : ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని విమర్శించారు.

రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై ఆదివారం ఆయన స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై పూర్తి నివేదిక అమిత్ షా వద్ద ఉందన్నారు. విశాఖలో ఎంపీ కుటుంబీకుల కిడ్నాప్ కేసుపై స్పందించిన జీవీఎల్.. ఘటనకు సంబంధించి పూర్తి నిజాలు బయటకు రావాలని డిమాండ్ చేశారు.

విశాఖలో భూమాఫియా ఉందని జీవీఎల్ ఆరోపించారు. విశాఖ భూకబ్జాపై ప్రత్యేక దర్యాప్తు నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. ఆ నివేదిక ఆధారంగానే ముఖ్యమంత్రి భూ సెటిల్ మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక దర్యాప్తు నివేదిక ఇవ్వాలని మంత్రి పేర్ని నాని కోరారు. బాపట్ల జిల్లాలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించడం అమానుషమన్నారు.

వైసీపీ కార్యకర్తలకు రాక్షస మనస్తత్వం ఉందని ఆరోపించారు. వైసీపీ అంటే రాక్షస సంత అని యద్దేవా చేశారు. చిన్నారి కుటుంబానికి ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక, మైనింగ్‌పై సీబీఐ దర్యాప్తు రాష్ట్రంలో రాజకీయ పార్టీ చేస్తోందని జీవీఎల్ విమర్శించారు.

read more :

donald trump : రెస్టారెంట్‌లో బిల్లు కట్టకుండానే డొనాల్డ్ ట్రంప్ వెళ్లిపోయారన్న వార్తల్లో నిజమెంత ?

-Advertisement-

Bronze Age sword : తవ్వకాల్లో 3,000 యేళ్ళ నాటి అష్టభుజి కత్తి లభ్యం.. ఇప్పటికీ మెరుస్తూనే.. ఎక్కడంటే?

comedian sudhakar : దేవుడా…! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ కమెడియన్..!

African Tribes : ఇదెక్కడి ఆచారం? పక్కోడి పెళ్లాన్ని లేపుకెళ్లి పెళ్లి చేసుకోవడమే అక్కడి సాంప్రదాయం!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News