Homecinemacomedian sudhakar : దేవుడా…! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ కమెడియన్..!

comedian sudhakar : దేవుడా…! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ కమెడియన్..!

Telugu Flash News

comedian sudhakar : ఏ ఇండస్ట్రీకి లేని ప్లస్ పాయింట్స్ టాలీవుడ్ కి ఉన్నాయి. ప్రస్తుతం మన దర్శకులు లెక్కలేనన్ని పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు తగ్గినప్పటికీ ఏ పరిశ్రమలోనూ లేనంతగా కమెడియన్లు తెలుగులోనే ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఫేడవుట్ అయిన కమెడియన్ రియాల్టీ షోలో సందడి చేశాడు. అతడిని చూసి అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.

ఇప్పటి తరానికి సుధాకర్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 15-20 ఏళ్ల క్రితం సినిమాలు చూసిన వాళ్లని అడిగితే గుర్తుకొస్తుంది. కమెడియన్‌గా మనల్ని నవ్వించిన ఆయన గత కొన్నేళ్లుగా ఎక్కడా కనిపించలేదు. కొద్ది రోజుల క్రితం సుధాకర్ మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. వాటిని ఖండిస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.

ఇప్పుడు ఫాదర్స్ డే సందర్భంగా ఓ ప్రముఖ ఛానెల్ ‘నేను నాన్న’ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. నటుడిగా 45 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నందుకు గానూ సుధాకర్‌ను ఈ షో వద్దకు తీసుకొచ్చిన నిర్వాహకులు సన్మానించారు. ఆయనతో కలిసి కేక్ కూడా కట్ చేశారు. ఇప్పుడు ఈ ప్రోమో వైరల్‌గా మారింది.

Comedian Sudhakar Garu Tribute Promo in Nenu Nanna program Father's Day Special
Comedian Sudhakar Garu Tribute Promo in Nenu Nanna program Father’s Day Special

ఈ ప్రోమోలో కమెడియన్ సుధాకర్‌ని మొదటిసారి చూసినప్పుడు చాలా మంది గుర్తుపట్టలేదు . ఆ తర్వాత తను చేసిన సినిమాలు, జనాలను నవ్వించే సన్నివేశాలు గుర్తు చేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగాలేదు. దీంతో సన్నబడి గుర్తుపట్టలేనంతగా తయారయ్యాడు. ఏది ఏమైనా ఆయన ఇలా షోకి వచ్చి అందరితో కలిసి ఎంజాయ్ చేయడం హ్యాపీ గా అనిపించింది.

read more  :

African Tribes : ఇదెక్కడి ఆచారం? పక్కోడి పెళ్లాన్ని లేపుకెళ్లి పెళ్లి చేసుకోవడమే అక్కడి సాంప్రదాయం!

-Advertisement-

విజయ్ తో జెర్సీ డైరెక్టర్ కొత్త సినిమా.. షూటింగ్ షురూ..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News