HomedevotionalHoroscope (13-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope (13-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 13th april 2023: Check astrological prediction for your zodiac signs

మేషం

ఈ రాశి వారికి సంబంధించిన ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కుటుంబంలో దాంపత్య జీవితంలో అన్యోన్యత క్ర‌మంగా పెరుగుతుంది. ఉద్యోగ పరంగా ఆశించిన ప్రయోజనం అనుభవానికి వచ్చే అవ‌కాశం ఉంది.

వృషభం

ఈ రాశికి చెందిన వారు ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఐటి నిపుణులకు కొంత పురోగతి కనిపిస్తోంది.

మిథునం

ఈ రాశి వారికి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో కూడా సానుకూలమైన మార్పు కనిపించే అవ‌కాశం ఉంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం చేస్తారు.. కుటుంబంలో ఒకటి రెండు సమస్యలు ఇబ్బంది పెడ‌తాయి. ఆహార విషయాల్లో జాగ్రత్తలు పాటించడం ఉత్త‌మం.

కర్కాటకం

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. స్నేహితుల సహకారంతో ముఖ్యమైన వ్యక్తిగత పనులు పూర్తి చేస్తారు.. వ్యాపారాల్లో లాభాల శాతం క్ర‌మంగా పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువ‌గా ఉంది.

సింహం

ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఇతర వృత్తి నిపుణులు బాగా బిజీ అయిపోతారు.. ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం ఉత్త‌మం. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

-Advertisement-

horoscope today teluguకన్య

ఈ రాశికి చెందిన వారి వృత్తి వ్యాపారాలు సజావుగా ముందుకు సాగిపోతాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఎక్కువ‌గా ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలు ఎక్కువ‌గా ఉన్నాయి. పరిచయస్తులలో మంచి పెళ్లి సంబంధం కుదిరే ఛాన్స్ ఉంది..

తుల

ఈ రాశి వారు కుటుంబ పరంగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత క్ర‌మంగా పెరుగుతుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారు కొన్ని రకాల వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పిల్లలు ఆశించిన స్థాయిలో క్ర‌మంగా పురోగతి సాధిస్తారు.

వృశ్చికం

ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో చక్కబడే అవ‌కాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి.. పెళ్లి సంబంధం వాయిదా పడే అవకాశం ఉంది. . పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది.

ధనుస్సు

ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. బంధువులు కొందరు మీ సలహాలను తీసుకుని మంచి ప్రయోజనం పొందుతారు. నిరుద్యోగులకు తీపి కబురు అందుతుంది. పెళ్లి సంబంధం కూడా ఖాయం అవుతుంది. ఆహార విహారాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంది.

మకరం

ఈ రాశి వారికి సంబంధించి ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి నిపుణులకు అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవ‌కాశం ఉంది.నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం వ‌స్తుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితి ఉంటుంది.

కుంభం

ఈ రాశి వారికి అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలావరకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇతరులకు వాగ్దానాలు చేయడం, హామీలు ఉండటం ప్రస్తుతానికి విరమించడం ఉత్త‌మం. వృత్తి వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి. ఉద్యోగంలో పని భారం పెరిగి కొంత ఇబ్బంది పడతారు.

మీనం

ఈ రాశికి చెందిన వారు కుటుంబ సభ్యులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో పురోగతి ఏర్ప‌డుతుంది.. వ్యాపారులు భారీగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెళ్లి సంబంధం విషయంలో కొంత చికాకులు ఏర్ప‌డ‌తాయి.

Also Read News :

భారతీయ ఋషులు ఎవరు? ఎంత మంది? ఆ ఋషుల వివరాలు తెలుసుకోండి..

benefits of wearing Rudraksha : ఏయే రుద్రాక్ష‌ ల‌ను ధ‌రిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి ?

Diabetes : మధుమేహ రోగులు ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

MLC Kavitha : ఎమ్మెల్సీ కవితతో వాట్సాప్‌ చాట్‌ను బయటపెట్టిన సుఖేష్‌.. కోడ్‌ లాంగ్వేజ్‌లో ఏముందంటే!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News