moral stories in telugu : హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో మనోజ్ అనే పిల్లాడు ఉండేవాడు. ఒకరోజు వరంగల్ నుండి వాళ్ల నాన్న మనోజ్ కి ఫోన్ చేసి వైజాగ్ లో ఉన్న తన స్నేహితుడి ఇంటికి వెళ్లమని చెప్తాడు. అతను ఒక విలువైన వస్తువు ఉన్న బ్యాగ్ ని ఇస్తాడు, తీసుకురావాలనీ చెప్తాడు. దాంతో మనోజ్ తండ్రి చెప్పిన అడ్రసు ప్రకారం స్నేహితుడి ఇంటికి వెళ్లాడు.
ఆయన ఆ విలువైన వస్తువు ని మనోజ్ చేతికి ఇస్తూ… ‘దార్లో దొంగలు ఉంటారు. ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్లు’ అని చెప్పాడు. ఇంటికి వచ్చే క్రమంలో మనోజ్ కి తన వెనకాల ఎవరో వస్తున్నట్లుగా అడుగుల చప్పుడు వినిపించింది. ఎవరో దొంగ తనని వెంబడిస్తున్నాడని తెలుసుకున్నాడు.
దాంతో భయపడుతూనే కాస్త వేగంగా నడవడం మొదలుపెట్టాడు. ఆ అడుగుల చప్పుడు వేగం కూడా పెరిగేసరికి… మనోజ్ కి ఏం చేయాలో పాలుపోలేదు. కొంతదూరం వెళ్లేసరికి మనోజ్ కి ఓ నీటి కాలువ కనిపించింది. దాన్ని చూడగానే అతడికో ఆలోచన వచ్చింది.
వెంటనే కాలువకి కాస్త పక్కగా ఉన్న పొదల్లోకీ తన దగ్గరున్న వస్తువును విసిరేసి, కాలువ పక్కన నిలబడి… ‘నా బ్యాగ్ నీళ్లలో పడిపోయింది..’ అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు.
మనోజ్ వెనకాలే వస్తున్న దొంగ ఎలాగైనా ఆ వస్తువును తీసుకోవాలనే ఉద్దేశంతో తాను తీసిస్తానంటూ కాలువలోకి దూకి వెతకడం ప్రారంభించాడు. అదే అదను అనుకున్న మనోజ్… పొదల్లోకి విసిరిన బ్యాగ్ ను తీసుకుని గబగబా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
also read :
moral stories in telugu : ఎవరు గొప్ప? జ్ఞానమా.. అదృష్టమా..?
moral stories in telugu : గుంటనక్క గొప్పలు.. కథ చదవండి
moral stories in telugu : సరస్సులో చందమామ.. కథ చదవండి
moral stories in telugu : ఇద్దరు అన్నదమ్ముల కథ
moral stories in telugu : మొదటికే మోసం.. కథ చదవండి
moral stories in telugu : కలలోని పాములు రాజుకి ఏం చెప్పాయి?
moral stories in telugu : నిన్ను నీవు నిందించుకోకు..
moral stories in telugu : సరదాకి కూడా అబద్ధం ఆడరాదు!
Moral Stories in Telugu : అందని ద్రాక్ష పుల్లన 🦊