Telugu Flash News

Moral Stories in Telugu : బంగారు ప్రమిద

Moral Stories in Telugu : యమునానదీ తీరంలో ప్రశస్థమైన శివాలయం ఒకటి ఉంది. ఒకరోజు వేకువఝామున పూజారి గుడి తలుపులు తెరవగానే ఆయనకు శివలింగం దగ్గర ఒక పెద్ద బంగారు ప్రమీద కనిపించింది. పూజారి ఆశ్చర్యపోతూనే దానిని తీసుకోబోయాడు. కాని వెంటనే ఆకాశం నుండీ ఈ ప్రమిదను పైకి ఎత్తాలంటే ఆ వ్యక్తి సత్యసంధుడు, ధర్మాత్ముడు అయి ఉండాలి. అలాంటి వ్యక్తి ముట్టుకోగానే దీని దీపపు వత్తులు వాటంతట అవే వెలుగుతాయి. పూజ పూర్తయ్యాక ఈ బంగారు ప్రమిద అతని సొంతమవుతుంది. అన్న మాటలు వినిపించాయి.

ఆ అద్భుతాన్ని చూడటానికి గుడి ముందు గుమిగూడి ఉన్నారు. వాళ్ళలో ఒక రైతు కూడా ఉన్నాడు. అతడు పగలంతా పొలంలో పనిచేసి సాయంత్రం పూట ఆవుపాలు పితికి పూజారికి దారిలో చలికి ఇవ్వటానికి వస్తాడు. ఆరోజు రైతు వస్తున్నప్పుడు గజగజా వణికిపోతున్న ఒక వ్యక్తి కనిపించాడు. అతడు ఆకలితో, అనారోగ్యంతో అలమటించి పోతున్నాడు. రైతు అతనికి తాగటానికి కొన్ని పాలు ఇచ్చాడు.

అతన్ని చూడగానే పూజారి వీరయ్యా ! నువ్వు కూడా ప్రయత్నించి చూడు” అని అన్నాడు.

“దాన ధర్మాలు చేసిన వాళ్ళు, పేదల కోసం సత్రాలు కట్టించినవాళ్ళు, ఇలా ఎంతోమంది ప్రయత్నించారు. వాళ్ళకు వీలుకానిది ఒక మామూలు వ్యక్తికి, పైగా పేదవాడైన ఇతనితో అవుతుందా ?” అని అంతా గుసగుసలాడారు.

పూజారి మాట కాదనలేక రైతు గుడిలోకి వెళ్ళాడు. అతను బంగారు ప్రమిదను చేతిలోకి తీసుకోగానే ఆ ప్రమిదకు ఉన్న అయిదు వత్తులూ వెలిగాయి. ఆ గుడి ప్రాంగణమంతా ప్రకాశ వంతంగా వెలిగిపోసాగింది.

“హరహరమహాదేవ శంభోశంకర” అని తన్మయంగా అరిచాడు పూజారి.

అక్కడున్నవారంతా భక్తితో చేతులెత్తి శివలింగానికి నమస్క రించారు. హారతి పూర్తయ్యాక పూజారి “వీరయ్యా ! నువ్వు దేవుని అనుగ్రహం పొందావు. ఈ బంగారు ప్రమిద నీదే. తీసుకు వెళ్ళు” అన్నాడు.

“అయ్యా ! దేవుడి వస్తువును నాదగ్గర ఉంచుకునేంత గొప్పవాడిని కాను. దీన్ని గుడిలోనే ఉంచండి. దర్శించుకొనే భాగ్యం అందరికీ దక్కుతుంది” అని రైతు చేతులు జోడించాడు.

నీతి:అయాచితంగా వస్తోంది కదా అని పది మందికీ ఉపయోగపడే వస్తువును ఒకరి దగ్గరే ఉంచుకోకూడదు.

also read news: 

ICC: పాకిస్తాన్‌కి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన ఐసీసీ… మ‌రోసారి అలా చేస్తే ఇక అంతే..!

sesame prawns pakodi : నువ్వుల రొయ్యల పకోడీ.. వింటర్ లో వేడి వేడిగా తింటే..ఆహా ఏమి రుచి

 

Exit mobile version