Miss Shetty Mr Polishetty Review
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కథ ఏంటంటే :
లండన్‌లో అత్యంత విజయవంతమైన చెఫ్‌లలో ఒకరైన అన్విత (అనుష్క శెట్టి) కెరీర్లో ఎంత బాగా సెటిల్ అయిన కూడా , ఆమెకు పెళ్లి కాకపోవడంతో ఆమె తల్లి , కుటుంబం బాధపడుతుంది. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని అన్విత స్టాండప్ కమెడియన్ సిద్ధు (నవీన్ పోలిశెట్టి)ని కలుస్తుంది. తల్లి మరణానంతరం, తనకు పెళ్లి ఇష్టం లేకపోయినా, భాగస్వామి కోసం డోనర్ ద్వారా పిల్లల్ని కనాలనుకుంటోంది. అందుకు సిద్ధూ సహాయం కోరింది. అప్పటికీ.. అన్విత పై పీకల్లోతు ప్రేమలో మునిగిన అన్వితకు సిద్ధూ సాయం చేస్తాడా? అన్విత పెళ్లికి ఎందుకు వ్యతిరేకం? చివరకు అన్విత-సిద్ధూ జంట ఒక్కటయ్యారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమా.
నటీనటులు ఎలా చేశారంటే ?
నవీన్ పొలిశెట్టి మరోసారి కామెడీ టైమింగ్‌తో సినిమాను తన భుజాలపై వేసుకున్నాడు. ఈ సారి కామెడీతో పాటు ఎమోషన్స్ సన్నివేశాలతోనూ ఆకట్టుకున్నాడు. ఆఫ్స్క్రీన్లోనే కాకుండా ఆన్‌స్క్రీన్‌లో కూడా ఎవరి పక్కనైనా అడ్జస్ట్ అయిపోవడం నవీన్ పొలిశెట్టి విద్య. ఈ సినిమాలో అతడు అనుష్క పక్కన బాగా చేశాడు. నిజానికి ఈ రెండు జంటల కెమిస్ట్రీ అంతగా ఆశాజనకంగా లేదు. కానీ.. నవీన్ తన పాత్రలో ఒదిగిపోయిన తీరు ఆ లోటు కనిపించకుండా చేస్తుంది. ఎప్పుడైతే వీళ్లిద్దరి కాంబినేషన్ బాగోలేదనే ఆలోచన ప్రేక్షకులకు కలిగిందో, తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆ విషయాన్ని మర్చిపోయేలా చేశాడు.
నటిగా అనుష్క గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే.. ఆమె కాస్త సన్నబడాలని చిత్ర బృందం చేసిన ప్రయత్నాలు వృధా చేశాయి. అనవసరమైన ఫిల్టర్లు మరియు గ్రాఫిక్స్ ఉపయోగించి ఆమెను సన్నగా కనిపించేలా చేయడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ముఖ్యంగా ఫిల్టర్లు/సిజి వర్క్ కారణంగా కాంబినేషన్ సీన్స్‌లో ఆమె క్లోజప్ షాట్లు అంతగా బాలేవు. నేచురల్ బ్యూటీ అయిన అనుష్కని నేచురల్ గా చూపిస్తే బాగుండేది. పోనీ గ్లామర్ రోల్ అయినా సరే. ఈ అనవసరమైన గ్రాఫిక్స్ ఎందుకు వాడుతున్నారో మేకర్స్ కే తెలియాలి. ఆ ఫిల్టర్ల వల్ల సినిమాకు ఎంత ప్లస్ అయ్యిందో తెలియదు. సోనియా దీప్తి చాలా ఏళ్ల తర్వాత తెరపైకి వచ్చింది. ఆమె డైలాగ్ డెలివరీ బాగుంది. ఆమెను తెలుగులో ఎందుకు సరిగ్గా వాడుకోలేకపోయామో అనిపిస్తుంది. తండ్రి పాత్రలో మురళీ శర్మ, తల్లి పాత్రల్లో జయసుధ, తులసి తమ పాత్రలకు సరిగ్గా సరిపోయే నటనను ప్రదర్శించారు.
టెక్నికల్ గా ఎలా ఉందంటే ?
రధన్ పాటలు కానీ గోపీసుందర్ నేపథ్య సంగీతం సినిమాకు పాజిటివ్ పాయింట్‌గా నిలవలేకపోయాయి. పైపెచ్చు పాటలు ప్లేస్మెంట్ సినిమాకు మైనస్. సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. UV ప్రొడక్షన్ యొక్క కాస్ట్లీ ప్రొడక్షన్ డిజైన్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ & కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో డబ్బులు బాగా ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. “ఒక అబ్బాయి మొదటి చూపులోనే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు మరియు ఆమెను పొందేందుకు చాలా కష్టపడతాడు” దర్శకుడు మహేష్ బాబు “డోనార్ ” పాయింట్ జోడించి కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. కానీ.. పేలవంగా రాసిన కథ వల్ల ఆ కొత్తదనం ఎలివేట్ కాలేదు. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ బాగా సాగదీసింది. సెకండాఫ్ కూడా సూటిగా పాయింట్లోకి రాకుండా చాలా మెలికలు తిరిగిపోయింది. అందుకే ఎమోషనల్ గా సాగే సెకండాఫ్ కూడా బోర్ కొట్టిస్తుంది. పాటలు, స్క్రీన్‌ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మహేష్ బాబు మంచి హిట్ కొట్టేవాడు. అయితే.. అనుష్క-నవీన్‌ల కాంబినేషన్‌ను సెట్ చేయగలగడం, ఇద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్‌ని కథలో మెయిన్ పాయింట్‌గా మలచుకోవడం సినిమా నిర్మాతగా తన పరిణితి చెందిన భావజాలాన్ని పరిచయం చేసింది. తదుపరి సినిమాల కోసం ఈ విషయం పక్కన పెడితే మంచి భవిష్యత్తు ఉంటుంది.
చివరిగా :
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ కి వెళితే హాయిగా ఎంజాయ్ చేసే సినిమా. నవీన్ పోలిశెట్టి అద్భుతమైన కామెడీ టైమింగ్, చక్కని ప్రొడక్షన్ డిజైన్ & సెకండాఫ్‌లోని ఎమోషన్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఈ రెండు విషయాల్లో ఇంకా జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా సూపర్ హిట్ అయ్యేది.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ రేటింగ్: 3/5
also read :
Sore throat : గొంతునొప్పికి 5 అద్బుతమైన చిట్కాలు
coriander leaves benefits : కొత్తిమీర తో కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు !