Sunday, May 12, 2024
HomereviewsSaindhav Telugu Movie Review : సైంధవ్ తెలుగు మూవీ రివ్యూ

Saindhav Telugu Movie Review : సైంధవ్ తెలుగు మూవీ రివ్యూ

Telugu Flash News

Saindhav Telugu Movie Review |

కథ ఏంటంటే :

సైంధవ్ కోనేరు అలియాస్ సైకో (వెంకటేష్) తన కూతురు గాయత్రి (సారా)తో సంతోషంగా జీవిస్తూంటాడు. వారి ఇంటి పక్కన ఉండే మనోజ్ఞ (శ్రద్ధ శ్రీనాథ్) పాపను చూసుకుంటుంది.

అయితే, గతంలో సైంధవ్ చేసిన నేరాల కారణంగా, కార్టెల్‌లో అతని పేరు వింటేనే భయపడతారు. అలాంటి గతం ఉన్న సైంధవ్ అన్ని వదిలేసి కూతురి కోసం బతుకుతుంటాడు.

కానీ, గాయత్రికి స్పైనల్ మాస్క్యూలర్ ఎంట్రోపీ అనే వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి నుంచి పాప బయటపడాలంటే రూ.17 కోట్ల విలువైన వైల్ కావాలి.

ఆ డబ్బుకోసం సైంధవ్ ఏం చేశాడు?

తన పాపను రక్షించుకున్నాడా? లేదా?

-Advertisement-

ఈ క్రమంలో వికాస్ మాలిక్‌ (నవాజుద్దీన్) తో వచ్చిన గొడవ ఏమిటి?

డా. రేణు (రుహాని శర్మ), జాస్మిన్‌ (ఆండ్రియా జెరెమియా) ఎవరు ?

చివరకు సైంధవ్ తన కూతురు కోసం ఏం చేశాడు?, అనేది మిగిలిన కథ.

పాజిటివ్ పాయింట్స్ :

సైంధవ్ కోనేరు పాత్రలో వెంకటేష్ చాలా బలంగా, శక్తివంతంగా కనిపించాడు. అతను తన పాత్రకు తగినంత వైవిధ్యాన్ని చూపించడంలో చాలా మెప్పించాడు. అతని యాక్షన్ సీన్లలో అతని బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ సీన్లలో అతని కళ్లలో కనిపించే భావోద్వేగాలు అతని నటనకు మరింత మెరుగును చేకూర్చాయి. అతని స్టైలిష్ లుక్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అతిథి పాత్రలో నటించిన ఆర్య కూడా తన పాత్రకు తగినంత న్యాయం చేశాడు. అతని నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా జెరెమియా, రుహాని శర్మ, జిషు సేన్‌గుప్తా, ముఖేష్ రిషి, జయప్రకాష్ వంటి ఇతర నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ప్రతి ఒక్కరు తమ పాత్రలో ఒదిగిపోయారు.

దర్శకుడు శైలేష్ కొలను రాసుకున్న కొన్ని యాక్షన్ సీన్లు బాగున్నాయి. అవి ప్రేక్షకులను ఉత్కంఠభరితంగా ఉంచాయి.

నెగెటివ్ పాయింట్స్ :

సినిమాలో ప్రధాన కథాంశం, పాత్రలు, నేపథ్యం, నటీనటుల పనితీరు బాగున్నాయి. అయితే, కథనం విషయంలో దర్శకుడు నిరాశపరిచాడు.

సెకండ్ హాఫ్‌లో పాత్రల మధ్య ఎమోషన్‌లను బాగా స్థాపించాడు. అయితే, కొన్ని చోట్ల మెలోడ్రామాలా అనిపించింది. సినిమాలో ఆసక్తికరమైన అంశాలు మిస్ అయ్యాయి.

పాప కోసం సైంధవ్ చేసిన పోరాటంలో ఎమోషన్ ఉంది. కానీ, ట్రీట్‌మెంట్‌లో సరైన కాన్‌ఫ్లిక్ట్ బిల్డ్ అవ్వలేదు.

ప్రధానంగా కొన్ని లీడ్ సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా రొటీన్ గానే సాగాయి. విలన్స్-హీరో మధ్య వార్‌కి లీడ్ ఇంకా బలంగా ఉండాల్సింది.

మొత్తమ్మీద, దర్శకుడు శైలేష్ ఈ సినిమాను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా మలచలేకపోయాడు. ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా వంటి మంచి నటీనటులు ఉన్నా, వారి పాత్రలను తగినట్టుగా డిజైన్ చేయలేదు.

టెక్నీకల్ గా ఎలా ఉందంటే ?

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే, దర్శకుడు శైలేష్ కొలను టేకింగ్‌లు బాగున్నాయి. అయితే, స్క్రీన్‌ప్లే బాగా రాయలేకపోయాడు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం సాధారణంగా బాగుంది. కొన్ని కీలక సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరింత బాగుండాల్సింది. సినిమాటోగ్రాఫర్ ఎస్. మణికందన్ పనితీరు చాలా బాగుంది. ఎడిటర్ పనితీరు కూడా సానుకూలంగా ఉంది. నిర్మాత వెంకట్ బోయనపల్లి పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ఫైనల్ గా :

‘సైంధవ్’ ఒక హై ఓల్టేజ్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా. కొన్ని చోట్ల ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది. వెంకటేష్ నటన, పాత్రకు తగినంత వైవిధ్యాన్ని చూపించడం సినిమాకు ప్లస్ అయ్యింది.

అయితే, స్క్రీన్‌ప్లేలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ కావడం, కొన్ని చోట్ల స్లో నేరేషన్, మరియు బోరింగ్ సీన్స్ వంటి అంశాలు సినిమాకు మైనస్ అయ్యాయి.

ఓవరాల్‌గా, ఈ సినిమాలో వెంకటేష్ నటన, కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయి. వెంకటేష్ ఫ్యాన్స్ ఓసారి చూడొచ్చు.

Saindhav Telugu Movie Rating : 3/5

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News