medico preethi case : మెడికో ప్రీతి మృతి కేసులో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ కేసులో తొలి నుంచి కేఎంసీ అనష్థీషియా డిపార్ట్‌మెంట్ హెడ్ నాగార్జునరెడ్డి తీరు విమర్శలకు తావిచ్చింది. తాజాగా ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నాగార్జునరెడ్డిని భూపాలపల్లి జిల్లాకు బదిలీ చేశారు.
హెచ్‌వోడీని సస్పెండ్ చేయాలని ప్రీతి తండ్రి నరేందర్ పలుమార్లు డిమాండ్ చేశారు. హెచ్‌వోడీ సకాలంలో స్పందించి చర్యలు తీసుకొని ఉంటే ర్యాగింగ్ భూతానికి తన కుమార్తె బలి అయ్యేది కాదని ఆయన వాపోయారు.
సీనియర్ల వేధింపులపై త్వరగా చర్యలు తీసుకొని ఉంటే ఇంత దాకా వచ్చేది కాదని ప్రీతి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు సీనియర్ మెడికో సైఫ్ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడు. సైఫ్ ర్యాగింగ్ వేధింపులు తట్టుకోలేక ప్రీతి ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే.
హానికరమైన ఇంజెక్షన్ తీసుకున్న ప్రీతి.. ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయింది. ఈ ఘటనతో ర్యాగింగ్‌పై మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ప్రీతి మృతి తర్వాత కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. మెడికో ప్రీతిపై వేధింపులు, ర్యాగింగ్ జరిగాయని పోలీసులు, యాంటీ ర్యాగింగ్ కమిటీలు సైతం నిర్ధారించాయి. ఘటనకు కారకుడైన సైఫ్‌పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ర్యాగింగ్ యాక్ట్ కింద కూడా మరో కేసు నమోదైంది. ఖమ్మం జిల్లా జైలు నుంచి సైఫ్‌ను మట్టెవాడ స్టేషన్‌కు తరలించి కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. సైఫ్ నుంచి ప్రీతి మృతిపై కీలక విషయాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు ప్రీతి ఎలా మృతి చెందిందన్న విషయంపై ఇప్పటికీ తేలకపోవడం గమనార్హం. నిందితుడు సైఫ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ర్యాగింగ్‌పై ఫిర్యాదు చేసినందుకు సైఫ్.. ప్రీతిపై కోపం పెంచుకున్నట్లు గుర్తించారు.
భార్గవి, డీవీవీ ప్లస్ నాక్‌ఔట్ గ్రపులను పోలీసులు పరిశీలించారు. ఓ యాక్సిడెంట్ కేసు విషయంలో ప్రీతిని సైఫ్ గైడ్ చేస్తున్నాడని తేలింది. ఆమె రాసిన ప్రిలిమినరీ అనస్థీషియాపై వాట్సప్ గ్రూపుల ద్వారా సైఫ్ పంపి హేళన చేశాడని తెలుస్తోంది. దీంతో సైఫ్‌కు ప్రీతి వార్నింగ్ ఇచ్చినట్లు గుర్తించారు.
దీంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. రెస్ట్ లేకుండా పని పెట్టడంతో హెచ్‌వోడీకి ప్రీతి ఫిర్యాదు చేసింది. దాని తర్వాత కౌన్సెలింగ్ ఇవ్వటం అటు తర్వాత కూడా సైఫ్ వేధింపులు ఆగకపోవడంతో ప్రీతి ఆత్మహత్యకు యత్నించింది.
also read :
Viral video : దానికదే స్టార్ట్ అయిన ట్రాక్టర్.. దెయ్యం తోలిందా? వీడియో వైరల్!
Naveen Murder Case : ట్రయాంగిల్ ప్రేమ కథలో సంచలన విషయాలు.. యువతి ఫోన్లో కీలక అంశాలు!
Samantha: ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే సమంత అన్ని కోట్లు సంపాదిస్తుందా..!