HomeSpecial Storiesmark zuckerberg : మెటా సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ రియల్ లైఫ్ స్టోరీ !

mark zuckerberg : మెటా సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ రియల్ లైఫ్ స్టోరీ !

Telugu Flash News

ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరైన మార్క్ జుకర్‌బర్గ్ (mark zuckerberg) గురించి తెలుసుకోవాలి,తెలియాలి అంటే ఈ స్టోరీ చదవండి.

1984, మే 14న న్యూయార్క్ లోని వైట్ ప్లైన్స్ లో సైకియాట్రిస్ట్ తల్లి కేరెన్ కు, డెంటిస్ట్ తండ్రి ఎడ్వర్డ్ జూకర్బర్గ్ కు మార్క్ జుకర్‌బర్గ్ జన్మించాడు. చిన్నతనం నుంచి కంప్యూటర్ తో ఇష్టంగా సమయం గడుపుతూ, ఎప్పుడూ దానిలో ఏదో ఒకటి చేస్తూ కనిపిస్తున్న మార్క్ ని గమనించిన తన తండ్రి ఎడ్వర్డ్ తనకు తెలిసిన “అటారి”(Atari) అనే బేసిక్ ప్రోగ్రామింగ్ ని మార్క్ కి నేర్పించాడు. దాన్ని మార్క్ సులువుగా నేర్చుకోవడంతో డేవిడ్ అనే కంప్యూటర్ ప్రోగ్రమర్తో కోడింగ్ నేర్చుకోవడంలో కోచింగ్ ఇప్పించాడు.

అలా కోచింగ్ నేర్చుకున్న మార్క్ డేవిడ్ కి సమానంగా, ఒకోసారి అతని కంటే వేగంగా కోడింగ్ చేసేవాడట. తన తోటి పిల్లలందరూ ఆటలంటూ బయట తిరుగుతుంటే మార్క్ మాత్రం కంప్యూటర్ లో కోడింగ్ చేసే వాడట. కంప్యూటర్ గేమ్స్ తయారు చేసే వాడట.

ఆ విధంగా 12 ఏళ్ల వయసులోనే ఇప్పటి మెసెంజర్ (messenger) లాంటి జూక్ నెట్(Zucknet) ఒక సాఫ్ట్వేర్ ని తయారు చేశాడు.దాన్ని ఇంటి నుంచి తన తండ్రి క్లినిక్ కి,క్లినిక్ నుంచి ఇంటికి సమాచారం పంపడానికి వాడే వాడట.

తను హై స్కూల్ లో చదువుతున్న సమయంలో సినాప్స్(synapse) అనే ఒక మీడియా ప్లేయర్ ని తయారు చేయగా దాన్ని కొనడానికి మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ముందుకు వచ్చాయట.

చదువు పూర్తి అవ్వక ముందే మార్క్ కి ఆ సంస్థలలో ఉద్యోగాన్ని ఇవ్వడానికి కూడా ఆ కంపెనీలు సిద్దమయ్యాయట.కానీ మార్క్ అసలు ఏ మాత్రం ఆలోచించకుండా వాటిని తిరస్కరించాడట.

-Advertisement-

ఫేస్ బుక్ ప్రారంభం:

mark zuckerberg

తన పైచదువుల కోసం హావర్డ్ యూనివర్సిటీలో చేరిన మార్క్ జుకర్‌బర్గ్ అక్కడ కూడా తన కోడింగ్ టాలెంట్ ని చూపించడం మొదలు పెట్టాడు. మొదట్లో ఫేస్ స్మాష్ అనే ఒక వెబ్సైట్ ని తయారు చేసి దాంట్లో ఇద్దరు అబ్బాయిలు లేదా అమ్మాయిల మధ్య అందాల పోటీలను పెట్టి వారిలో ఎవరు బావున్నారో ఓటింగ్ చేయమనేవాడట.

కానీ ఈ ఓటింగ్ ఇవ్వడం కొంత మంది అమ్మాయిలకి ఇష్టం లేక పోవడంతో వాళ్ళు హావర్డ్ ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ ఇవ్వగా ఆ ఫేస్ స్మాష్ సైట్ మధ్యలోనే ఆగిపోయింది.

కానీ అపజయాన్ని అంత త్వరగా ఒప్పుకోని మార్క్ ఆ ఫేస్ స్మాష్ ఐడియానే కొంచెం మార్చి దాంట్లో ఎవరైనా సరే వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ జీవితం గురించి, వాళ్ళ ఫోటోలను దాంట్లో పెట్టేలా “ది ఫేస్ బుక్” అనే వెబ్సైట్ ని తయారు చేసి దాన్ని కాలేజీ మొత్తం ఉపయోగించేలా చేశాడు.

దీంతో ఈ సైట్ కొంత కాలంలోనే యూనివర్సిటీని ఊపేసింది. ఆ తరువాత దీన్ని వేరే కాలేజీ స్టూడెంట్స్ కి కూడా అందుబాటులోకి తెచ్చాడు మార్క్. అయితే ఇంతలా రోజు రోజుకీ పెరుగుతున్న ఫేస్ బుక్ ని కాలేజీకి వెళ్ళడం వలన అభివృధి చేయలేకపోతున్నానని భావించిన మార్క్ తన చదువును మధ్యలోనే ఆపేసి 2004 ది ఫేస్ బుక్ ని “ఫేస్ బుక్” గా మార్చి ప్రజల మధ్యకు తీసుకువచ్చాడు.

అలా ప్రపంచంలోకి వచ్చిన “ఫేస్ బుక్” అనతి కాలంలోనే అందరి అంచనాలను మించేసి నెట్ లో సంచలనంగా మారింది. ప్రతి క్షణం మెరుగైన ఆలోచనలతో వేగంగా ఎదుగుతున్న మార్క్ 2012లో అందరూ వద్దని చెప్తున్నా వినకుండా ఇన్ స్టాగ్రామ్ ని తన సొంతం చేసుకున్నాడు.

మార్క్ వివాహం

అది ఇప్పుడు ఫేస్ బుక్ కంటే పెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గా మారింది.ఇదే ఏడాది మే 19న తన మనసుకు నచ్చిన ప్రిసిల్లా చాన్ ని వివాహమాడి తన వ్యక్తి గత జీవితంలో కూడా ఒక అడుగు ముందుకు వేశాడు.

2014లో 19 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని చెల్లించి వాట్స్ యాప్ (whatsapp) ని కూడా తన చేజిక్కించుకున్నాడు.

ఇలా అభివృద్ధి కనిపించిన ప్రతి కంపెనీని తన సొంతం చేస్కుంటూ వచ్చి ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరిగా మారిపోయాడు.

2022లో 42 బిలియన్ డాలర్ల నెట్ వర్త్ (net worth) కలిగిన వ్యక్తిగా ఫోర్బ్స్ (forbes)పత్రిక ప్రకటించిన మార్క్ జుకర్‌బర్గ్ జీవితం ఆధారంగా 2010లో “ది సోషల్ నెట్వర్క్” అనే బయోపిక్ చిత్రం కూడా తెరకెక్కింది.

ఇలా ప్రతి దశలో అందరూ ఆశ్చర్యపోయేలా అభివృద్ధి చెందుతూ వచ్చిన మార్క్ ఎదగాలనుకుంటున్న యువకులందరికీ ఒక గొప్ప ఆదర్శంగా నిలుస్తున్నాడు.

also read news:

Weight loss :మీరు నాజూగ్గా కనబడాలనుకుంటున్నారా? ఇలా చేస్తే మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేరు..

Cold Remedies: జలుబు తగ్గడానికి ఏం చేయాలి? ఈ ఆయుర్వేద చిట్కాల‌ను పాటించండి..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News