వెబ్‌సైట్‌లు, యూట్యూబ్ ఛానెల్‌లకు మంచు ఫ్యామిలీ(manchu family) లీగల్ నోటీసు పంపించారు. అసలు విషయం ఏంటంటే.. మోహన్ బాబు(mohan babu) చిత్రం, ‘సన్ ఆఫ్ ఇండియా(son of india)’ చిత్రం నిన్న విడుదలైంది. సినిమా రివ్యూ లు కూడా అంత ఆశాజనకంగా లేవని తెలుస్తుంది. మొదటి రోజు థియేటర్ ఆక్యుపెన్సీ కూడా చాలా తక్కువగా ఉంది.
విడుదలకు ముందే సోషల్ మీడియా(social media)లో సినిమాపై,మంచు ఫ్యామిలీ(manchu family)పై రకరకాల ట్రోల్స్‌తో నిండిపోయింది. ఇప్పుడు ఈ విషయం పై చర్యలు తీసుకోడానికి మంచు ఫ్యామిలీ కొన్ని వెబ్‌సైట్‌లకు మరియు యూట్యూబ్ ఛానెల్‌లకు లీగల్ నోటీసు పంపారు.
నోటీసులో ఏం చెప్పారంటే “మేము మీ సంస్థలపై దావా వేస్తాము మరియు రూ. 10 కోట్ల నష్టపరిహారాన్ని క్లెయిమ్ చేసే స్థాయికి వెళ్తాము”. మంచి అభిరుచితో చేసే మీమ్స్ కూడా తనకు ఇష్టమని మోహన్ బాబు కొద్దిరోజుల క్రితం చెప్పారు. అయితే ఇప్పుడు అతడి కుటుంబసభ్యులు నోటీసులు పంపి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.