Telugu Flash News

Kurnool Crime News : భార్య మహాలక్ష్మి, అత్త హనుమంతమ్మను హతమార్చిన భర్త రమేష్ 🔪

kurnool crime news

Kurnool Crime News : కర్నూలు జిల్లా కౌతాళం మండలం బాపురంలో దారుణం జరిగింది. భార్య పై అనుమానం పెంచుకున్న భర్త రమేష్ మహాలక్ష్మి , అడ్డుగా వచ్చిన అత్త హనుమంతమ్మను హత్య చేశాడు. రెండు నెలల క్రితం కర్ణాటకకు చెందిన రమేష్ కు బాపురం గ్రామానికి చెందిన మహాలక్ష్మి అనే యువతితో వివాహమైంది. అయితే భార్య మహాలక్ష్మిపై భర్తకు అనుమానం పెరిగింది. నిందితుడు రమేష్ శనివారం అర్ధరాత్రి ఆమె ఇంటికి వచ్చి నిద్రిస్తున్న మహాలక్ష్మి, ఆమె తల్లి హనుమంతమ్మలను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.

అయితే నిందితుడు రమేష్ కర్ణాటక రాష్ట్రం టెక్కలికోటకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రమేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహాలక్ష్మి వాలంటీర్‌గా పనిచేస్తుండగా, వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న రమేష్‌కు రెండు నెలల క్రితం మహాలక్ష్మితో వివాహమైనట్లు పోలీసుల విచారణలో తేలింది. రమేష్, మహాలక్ష్మి లకు గతంలో వివాహమై భార్య, భర్తలను వదిలేశారని తెలిపారు.

బాపురంలో రమేష్ భార్య, అత్తపై అనుమానంతో నరికి చంపిన విషయం తెలుస్తుంది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ రెండు హత్యలు ఆలస్యంగా అందరికీ తెలిసింది . నిందితుడు రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇటీవలి కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాహేతర సంబంధాలు, అనుమానాల కారణంగా హత్యలు జరుగుతున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా జరుగుతున్న వరుస హత్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. నిత్యం ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది.

read more news :

Karnataka News : పెళ్లయిన రెండో రోజే భర్తపై వేధింపుల కేసు 😮

Minister Roja: మంత్రి రోజాకు అస్వస్థత 😥 అపోలో ఆస్పత్రికి తరలింపు

Samantha Hot Video : సెర్బియా పబ్ లో ఆ హీరో తో సమంత స్టెప్పులు.. వీడియో వైరల్

Exit mobile version