HomenationalKejriwal : ఢిల్లీని గెలవాలనుకుంటే ముందు ఆ పని చేయాలి.. మోదీకి కేజ్రీవాల్‌ సలహా!

Kejriwal : ఢిల్లీని గెలవాలనుకుంటే ముందు ఆ పని చేయాలి.. మోదీకి కేజ్రీవాల్‌ సలహా!

Telugu Flash News

కేంద్రంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌ (arvind kejriwal) మరోసారి మండిపడ్డారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. దురుద్దేశంతో మాత్రమే ఇలాంటి చర్యలకు కేంద్రం దిగుతోందని దుయ్యబట్టారు.

ఇప్పటిదాకా కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెడుతుంటే అడ్డుకోలేదని గుర్తు చేశారు. బడ్జెట్‌ను అర్థం చేసుకోలేని కొందరు నిరక్షరాస్యులకు చూపించే బదులుగా అర్థం చేసుకొనే వారికి ఇస్తే బాగుంటుందంటూ బీజేపీ నేతలపై కేజ్రీవాల్ సెటైర్లు వేశారు.


Rajamouli: ఐదు ల‌క్ష‌ల కోసం రాజ‌మౌళి న‌న్ను అవ‌మానించారు అంటూ సీనియ‌ర్ న‌టి కామెంట్


కేంద్ర ప్రభుత్వంతో తమకు ఎలాంటి వైరం లేదని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ తమకు మద్దతు ఇస్తే.. అదే రకంగానే తమ నుంచి బీజేపీ మద్దతు లభిస్తుందని స్పష్టం చేశారు. ఢిల్లీ అసెంబ్లీలో ఈరోజు కేజ్రీవాల్‌ మాట్లాడారు.

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నడుమ ఎలాంటి గొడవలు లేకుంటే డిల్లీలో అభివృద్ధి మరో పది రెట్లు ఎక్కువగా ఉండేదని కేజ్రీవాల్‌ చెప్పారు. ఇవాళ బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి ఉందన్న కేజ్రీవాల్.. కేంద్రం దాన్ని కుట్రపూరితంగా అడ్డుకుందని ఆరోపించారు. ఎలాంటి మార్పులు చేయకుండానే కేంద్ర హోం శాఖకు బదులిచ్చామన్నారు.


Evergreen : ఉద్యోగులకు బంపరాఫర్‌.. ఆ కంపెనీలో ఏకంగా ఐదేళ్ల బోనస్‌!

-Advertisement-

అటు తర్వాత బడ్జెట్‌కు కేంద్ర హోం శాఖ ఆమోదం తెలిపిందని సీఎం తెలిపారు. బీజేపీ ముందు తలొగ్గాలనేది వారి కోరిక అని, ఇది కేవలం వాళ్ల అహం మాత్రమేనని కేజ్రీవాల్‌ చెప్పారు. అంతకు మించి ఇంకేమీ లేదన్నారు. కేంద్రంతో కలిసి పని చేయాలని తాము భావిస్తున్నామని, గొడవల వల్ల ఏ ఒక్కరికీ ప్రయోజనం ఉండబోదన్నారు.

తాము గొడవలు కోరుకోవడం లేదని ఢిల్లీ సీఎం స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి పని చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీలో మోదీ గెలవాలని కోరుకుంటే దానికి ముందుగా ప్రజల మనసులు గెలవాలని ప్రధానికి సూచించారు. ఇదే మోదీకి తాను చెప్పే మంత్రమని స్పష్టం చేశారు.

ఇక ఢిల్లీ ప్రభుత్వం తయారు చేసిన వార్షిక బడ్జెట్‌లో వాణిజ్య ప్రకటనల కోసం కేటాయించిన మొత్తం ఎక్కువగా ఉండటం అభ్యంతరకరమని హోం శాఖ తెలిపిందని ఆప్‌ పార్టీ వర్గాలు తెలిపాయి.


Niharika: విడాకుల ప్ర‌చారం నేప‌థ్యంలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన నిహారిక‌


దాంతోపాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయని హోం శాఖ పేర్కొందని తెలుస్తోంది.

వీటన్నింటికీ సంబంధించిన అనుమానాలు నివృత్తి చేయాలని కేంద్ర హోం శాఖ సీఎం కేజ్రీవాల్‌ను కోరగా, అందుకు ఆప్‌ ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు హోం శాఖ బడ్జెట్‌ను ఆమోదించింది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News